iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూల్స్ కి సెలవు.. కారణం ఇదే!

  • Published Jul 28, 2024 | 10:53 AM Updated Updated Jul 28, 2024 | 11:08 AM

School holiday on monday: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ప్రకటించింది. ఇంతకీ కారణం ఏంటంటే?

School holiday on monday: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ప్రకటించింది. ఇంతకీ కారణం ఏంటంటే?

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూల్స్ కి సెలవు.. కారణం ఇదే!

పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా స్కూల్స్ కు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. వర్షాలు, పలు పండగల నేపథ్యంలో స్కూల్స్ కు సెలవులు మంజూరు చేస్తున్నారు అధికారులు. వరుస సెలవులతో విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరో గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. రేపు పాఠశాలలకు సెలవును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం రోజు అనగా (29/07/2024) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ప్రకటిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు ప్రకటించడానికి గల కారణం ఏంటంటే?

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో బోనాల పండగ ఒకటి. ఆషాడ మాసంలో హైదరాబాద్ లో బోనాల పండగను ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శక్తి స్వరూపిణి మహంకాళీ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఊరు, వాడ అంతా కలిసి బోనాల పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఆషాడ మాసం ప్రారంభం అవ్వగానే బోనాల వేడుక ప్రారంభమవుతుంది.

దాదాపు నెల రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉజ్జయిని మహంకాళీ, గోల్కొండ ఎల్లమ్మ బోనాలు, లాల్ దర్వాజ మహంకాళికి బోనాలు సమర్పిస్తుంటారు. బోనాల సందర్భంగా మొక్కుల రూపంలో తొట్టెలు, ఫలహారం బండ్లు, ఘటాల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలు, రంగం- భవిష్య వాణితో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బోనాల పండగ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవును ప్రకటించింది. సోమవారం నాడు అన్ని పాఠశాలలు సెలవును పాటించనున్నాయి. మంగళవారం నుంచి యధావిధిగా స్కూల్స్ నడుస్తాయని అధికారులు తెలిపారు. స్కూల్స్ కు వరుస సెలవులు వస్తుండడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.