iDreamPost
android-app
ios-app

రేపటి నుంచి వరుసగా 5 రోజులు సెలవులు! ఇక అందరికీ పండగే

  • Published Aug 14, 2024 | 1:58 PM Updated Updated Aug 14, 2024 | 4:01 PM

Five Days Holidays For Employees In August: ఆగస్టు నెల ప్రారంభమైంది.. శ్రామణ మాసం వచ్చింది. ఇక పండగలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈనెలలో ఉద్యోగులకు గొప్ప శుభవార్త.. మీరు ఆ ఒక్క పని చేస్తే ఏకంగా 5 రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

Five Days Holidays For Employees In August: ఆగస్టు నెల ప్రారంభమైంది.. శ్రామణ మాసం వచ్చింది. ఇక పండగలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈనెలలో ఉద్యోగులకు గొప్ప శుభవార్త.. మీరు ఆ ఒక్క పని చేస్తే ఏకంగా 5 రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

రేపటి నుంచి వరుసగా 5 రోజులు సెలవులు! ఇక అందరికీ పండగే

ఆగస్టు మొదటి వారం ఆషాఢం ముగిసింది.. శ్రావణం మాసం మొదలైంది. సాధారణంగా జూన్ 12 నుంచి పాఠశాలల అకాడమిక్ ఇయర్ ప్రారంభమైతే.. ఆగస్టు నుంచి సెలవులు ఎక్కువగా వస్తుంటాయి. కొన్నిసార్లు సెలవులు మనం ఊహించని రీతిలో వస్తుంటాయి. ముఖ్యంగా పండుగల సమయంలో.. ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. రేపటి నుంచి (ఆగస్టు 15) స్కూల్, కాలేజ్ విద్యార్ధులకే కాదు.. ఉద్యోగులకు కూడా భారీగా సెలవులు దొరికే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ మధ్యలో ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది అందరికీ వర్క్ ఔట్ కాదు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రం సింపుల్ ట్రిక్ ఫాలో అయితే వరుసగా ఐదు రోజుల పాటు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రేపు ఆగస్టు 15 (గురువారం) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆఫీసులు తెరచి ఉంచినప్పటికీ జెండా వందనం వరకు మాత్రమే పరిమతం. కొన్ని ఆఫీసులు, విద్యా సంస్థలకు ముందే హాలిడే ప్రకటిస్తారు. ఆ రోజు సెలవు కింద పరిగణలోకి వస్తుంది. ఆగస్టు 16 (శుక్రవారం) శ్రావణ శుక్రవారం ‘వరలక్ష్మీ వ్రతం’. ఆ రోజు చాలా మంది స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు. కొన్ని ఆఫీసులకు మాత్రం సెలవు ఉండదు. ఆ రోజు ఎదైనా కారణంతో సెలవు తీసుకుంటే ఇక తర్వాత రోజు ఆగస్టు 17 (శనివారం) సాఫ్ట్ వేర్ సంస్థలు, కొన్ని ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఉంటుంది. కొన్ని ఆఫీసులకు మాత్రం సెకండ్ సాటర్డే డే సెలవు ఉండదు.. వాళ్లు ఏదో విధంగా ఆ రోజు హాలీడే తీసుకుంటే మరుసటి రోజు ఆగస్టు 18 (ఆదివారం) ఎలాగూ అందరికీ పబ్లిక్ హాలీడే. ఇక ఆగస్టు 19 (సోమవారం) రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆరోజు స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ఇవ్వనున్నారు.

ఇలా 15,16,18,19 ఎలాగూ సెలువు ఉంటాయి.. మధ్యలో ఆగస్టు 17 (శనివారం) సెలవు కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ రాఖి పౌర్ణానికి హాలిడే ఆప్షన్ లేకపోతే కనీసం వారు ఏదైనా ట్రిక్ ప్రయోగించి ఆరోజు సెలువు తీసుకుంటే వరుసగా 5 రోజులు హాలిడేస్ కలిసి వస్తాయి.. దీంతో లాండ్ వీక్ ఎండ్ దొరుకుతుందని అంటున్నారు. అయితే ఒక్కో కంపెనీలో.. విద్యా సంస్థల్లో ఒక్కో రకంగా సెలవులు ఇస్తారు.. వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిరోజు ఆఫీస్ వర్క్, చదువులో మానసికంగా ఇబ్బంది పడేవారు ఉల్లాసంగా గడిపేందుకు ఐదు రోజులు మంచి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా జలాశయాలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సమయంలో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. అద్భుతమైన సీనరీస్ ని మీ కెమెరాల్లో బంధించేందుకు టూర్ ప్లాన్లు చేసుకోండి అని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడికి వెళ్లాలి? ఎవరితో వెళ్లాలి? ఎంత బడ్జెట్ ఏంటి? అన్నీ ప్లాన్ చేసుకోండి. లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయండి.