రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేసింది చెప్పుకోవాలి. అప్పుడే ఓట్లు పడతాయ్. ఏపీలో అధికారంలోకి వస్తామనే ఆశతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేసిందనే విషయాలను తరచూ మీడియా ముందు చెబుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇచ్చిందని జీవీఎల్ చెబుతున్నారు. ఇక సోము వీర్రాజు […]
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు… అయితే ఆ చేతులు మనస్ఫూర్తిగా కలుస్తున్నాయా? లేదా బలవంతంగా కలుస్తున్నాయా? అనేదానిపైనే ఆ చప్పట్లకు సార్థకత ఉంటుంది. జైజై నినాదాలు… హర్షధ్వానాలు కూడా అంతే. ప్రజల మనస్సులలో నుంచి స్వచ్ఛందంగా రావాలే తప్ప బలవంతంగా చేయించుకున్నా పెద్దగా స్పందన ఉండదు. రాజకీయ సభలు.. సమావేశాలు అనగానే చప్పట్లు… జైజై నినాదాలు.. హర్షధ్వానాలు సర్వసాధారణం. చాలా సభల్లో పాల్గొనేవారు తప్పదన్నట్టుగా, మొక్కుబడిగా చేస్తారు. నిర్వాహకులు అడిగి మరీ కొట్టించుకుంటారు. కాని కొన్ని సందర్భాలలో […]
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలున్నాయి. అన్ని పార్టీలు పోలింగ్‌కు సిద్ధమవుతున్నాయి. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కాబోతోంది. సాయంత్రానికి ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్‌ను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తారు. మే 2న ఎవరి భవిష్యత్ ఏమిటో తేలిపోతుంది. ఎవరి లక్ష్యాలు వారివి.. అధికార వైసీపీ సహా ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ–జనసేన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు పార్టీల లక్ష్యాలు భిన్నమైనవి. గతం కన్నా ఎక్కువ మెజారిటీ సాధించాలని వైసీపీ, చావుబతుకుల సమస్య […]
రాజకీయాలు ఎప్పుడూ వింతగానే ఉంటాయి. రాజకీయ నేతలు చేసే ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఎన్నికలంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు, ప్రతివిమర్శులు ప్రజలకు వినోదాన్ని పంచుతాయి. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీ నేతలు ప్రజలకు తమ ప్రకటనలతో పసందైన వినోదాన్ని పంచుతున్నారు. టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫునే కేంద్ర […]
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. పవన్ కల్యాణ్‌ను గొప్పగా చూసుకోవాలని, పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని బీజేపీ పెద్దలు చెప్పారు.. ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలని భావిస్తున్నారు.. అంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. రాష్ట్ర అధిపతి అంటే.. పవన్ కల్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిని చేస్తామని కమలం పార్టీ ఏపీ అధిపతి చెబుతున్నారనుకోవాలి. సోము వీర్రాజు […]
ఏపీలో బలపడేందుకు, తన బలం ఏమిటో చూపించేందుకు తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ ఒక అవకాశంగా భావిస్తోంది. అందుకే అన్ని పార్టీల కన్నా ముందే తిరుపతి ఉప ఎన్నిక రంగంలోకి దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ శోభా యాత్రను కూడా నిర్వహించింది. జనసేన, బీజేపీ.. ఎవరు పోటీ చేస్తారనేది కూడా తేలిపోయింది. బీజేపీయే పోటీ చేసేందుకు ఇరు పార్టీల నేతలు అంగీకారనికొచ్చారు. అయితే అభ్యర్థి ఎవరు..? […]
వలంటీర్ వ్యవస్థపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన అక్కసును వెల్లగక్కారు. వలంటీర్ వ్యవస్థ శుద్ధ దండగని వీర్రాజు చెబుతున్నారు. నవరత్నాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వలంటీర్లు ఓటర్లను బెదిరించారని సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు. వలంటర్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం నెలకు 310 కోట్ల రూపాయలను వృథా చేస్తోందని కూడా చెప్పారు. గ్రామ, వార్డు స్థాయి […]
బిజెపి, జనసేన మధ్య ఏర్పడిన మాటల యుద్ధం రాజకీయాల్లో కాక రేపుతుంది. తిరుపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ని నిలబెట్టిన తర్వాత దానికి మద్దతు పలికిన జనసేన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తన స్వరాన్ని మార్చింది. దీంతో బిజెపి, జనసేన మధ్య ఏర్పడిన మైత్రి మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. జనసేన, బిజెపి నేతల వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తోంది. చిచ్చుపెట్టిన తెలంగాణ ఎన్నికలు బిజెపి జనసేన మధ్య తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురేపాయి. […]
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్ స్టూడియోలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డిపై జరిగిన దాడి మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చర్చ కార్యక్రమంలో లైవ్‌లోనే మాటా మటా పెరిగి అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డిపై చెప్పు దాడి చేశారు. ఈ ఘటన ప్రజలందరూ వీక్షించారు. ఈ ఘటన కొందరి ప్రొద్భలంతోనే జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చర్చ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్న జర్నలిస్ట్ […]
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల ఆమోదం ఉండదు. అలాంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా.. సదరు ఆస్తి ఉన్న ప్రాంతంలోని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొవాల్సిందే. వైజాగ్ స్టీల్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ నగర వాసులే కాదు యావత్ ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్నారు. పైగా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక గొప్ప చరిత్ర ఉంది. భూములు, ప్రాణ త్యాగాలు […]