iDreamPost
android-app
ios-app

స్క్విడ్ గేమ్ ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jun 13, 2025 | 6:50 PM Updated Updated Jun 13, 2025 | 6:50 PM

కొరియన్ వెబ్ సిరీస్ లలో ఈ సిరీస్ కు దక్కిన ఆదరణ మరే సిరీస్ కు దక్కి ఉండదు. ఈ సిరీస్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు మూడు సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కొరియన్ వెబ్ సిరీస్ లలో ఈ సిరీస్ కు దక్కిన ఆదరణ మరే సిరీస్ కు దక్కి ఉండదు. ఈ సిరీస్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు మూడు సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Published Jun 13, 2025 | 6:50 PMUpdated Jun 13, 2025 | 6:50 PM
స్క్విడ్ గేమ్ ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కొరియన్ వెబ్ సిరీస్ లలో ఈ సిరీస్ కు దక్కిన ఆదరణ మరే సిరీస్ కు దక్కి ఉండదు. ఈ సిరీస్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు మూడు సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మూడో సీజన్ ట్రైలర్ కూడా వచ్చేసింది. మొదటి రెండు సీజన్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సీజన్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇక ఈ సీజన్ ఎంట్రీ డేట్ రానే వచ్చింది.

మోస్ట్‌ అవైటెడ్‌ స్క్విడ్‌ గేమ్‌ సీజన్ 3 స్ట్రీమింగ్‌ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జూన్ 27, 2025 నుంచి సీజన్ 3 స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ , ట్రైలర్స్ సిరీస్ పైన అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సీజన్ తో స్టోరీని ఎండ్ చేసేస్తున్నారట మేకర్స్. కాబట్టి మొదటి రెండు సీజన్స్ ను ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఓ లుక్ వేసేయండి. ఎందుకంటే మూడో సీజన్ అంతకు మించిన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మొదటి సీజన్‌ 2021, సెప్టెంబర్‌ 17న నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ చేసింది. మొదట కొరియన్‌ భాషలో వచ్చిన సిరీస్‌ ఆ తర్వాత అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇండియాలో చాలా మందికి ఈ వెబ్ సిరీస్ ఓ ఎమోషన్. ఈ సిరీస్ కథ అంతా కూడా లైఫ్ అండ్ డెత్ గేమ్ ఆడి డబ్బులు గెలుచుకోవడం అనే కథ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సిరీస్ టైటిల్కొరియన్ పిల్లల ఆట అయిన ఓజింజియో అంటే స్క్విడ్‌ గేమ్‌ నుంచి తీసుకున్నారు. ఇక 27 నుంచి స్ట్రీమింగ్ కానున్న మూడో సీజన్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.