చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ మునుగోడు ఉప ఎన్నికపై పడింది. అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఆశలను ఈ వ్యాఖ్యలు బాగా దెబ్బతీశాయి. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ క్షమాపణ చెప్పారు. కాని, రేవంత్ క్షమాపణలను తాను పట్టించుకోనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. తనను తిట్టిన అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబడ్డారు. అంతేకాదు, సస్పెన్షన్ తర్వాతే రేవంత్ […]
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరుచుకుంది. అంతర్గత కుమ్ములాటల వల్లనే పంజాబ్‌లో ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ పరిణామం తర్వాత మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి వల్ల నష్టం జరిగే పరిస్థితి రానీయకూడదని హస్తం పెద్దలు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణలో పార్టీ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుతో అర్థమవుతోంది. […]
రేవంత్ రెడ్డి.. మంచి మాటకారి. ప్రస్తుతం తెలంగాణలో ఫైర్ బ్రాండ్. కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేస్తారు. కాంగ్రెస్ లో చేరి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. పీసీసీ రేసులో ఉన్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి తరఫున ప్రచారం గట్టిగానే చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు.. ఈనెల 15న కీలక కామెంట్లు చేశారు. ‘‘17వ తారీఖున పోలింగ్ పూర్తయ్యాక.. మంత్రులు, ఇన్ చార్జ్ లుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు. […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా జీవన్ రెడ్డి ఖరారయ్యారని, నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ తెరపైకి మొదలైంది. రాష్ట్రంలోనాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తో పాటు కొంత మంది సీనియర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు.. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హైకమాండ్ పెద్దలకు […]
కుదేలవుతున్న కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలిచ్చేదెవరు? ఇప్పుడీ ప్రశ్న తెలంగాణలో అందరి మదినీ తొలుస్తోంది. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీ పగ్గాలు ఎవరు చేపడుతారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం గట్టి కసరత్తే చేసింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో పార్టీ పెద్దలందరితోనూ సంప్రదింపులు నిర్వహించారు. వేరు వేరుగా […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త అధ్యక్షుడుగా ఎవరు రాబోతున్నారు..? అధిష్టానం ఎవరిని ఎంపిక చేయబోతోంది..? వచ్చే నేత కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టగలడా..? అతనికి పార్టీలోని సీనియర్ నేతలు సహకరిస్తారా..? లాంటి అనేక సందేహాలు ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొన్నాయి. టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు రేసులో […]
తెలంగాణా రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ప్రత్యేక స్థానం. వివిధ పార్టీలు మారుతూ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అక్కడ కూడా స్థిరంగా ఉంటారా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. అయితే ఆయన రాష్ట్ర స్థాయి రాజకీయ నేతగా ఎదగడానికి దోహదపడిన దూకుడు ఇప్పుడు చిన్నబోతోంది. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా రేవంత్ రెడ్డిని మించి బీజేపీకి చెందిన బర్నింగ్ స్టార్లు తయారయ్యారు. ఇన్నాళ్లుగా రేవంత్ రెడ్డికి ఉన్న గుర్తింపునకు ఎసరు పెడుతున్నారు. […]
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆ ప్రకటనలనే బలంగా వినిపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లోనూ మేయర్ సీటు కోసం టీఆర్‌ఎస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. గ్రేటర్‌ను తాము గెలుస్తామంటే.. తాము గెలుస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తూ రాజధానిలో ఎన్నికల వేడిని రాజేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీల తీరు ఇలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మేయర్ గెలుపు ఊసే […]
తెలంగాణా రాజకీయాల్లో కీలక మలుపులు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదని, బీజేపీగా ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ ఓ సంకేతానికి సిద్దమయినట్టు కనిపించింది. కాంగ్రెస్ తో సహా కేసీఆర్ ని వ్యతిరేకించే శక్తులన్నీ బీజేపీని బలపరిచేందుకు ఆ ప్రకటన తోడ్పడింది. చివరకు బీజేపీ విజయానికి టీఆర్ఎస్ ప్రకటన కూడా ఓ కారణంగా భావించేవాళ్లున్నారు. అంతేగాకుండా భవిష్యత్ తెలంగాణా రాజకీయ ముఖచిత్రంపై పలు మార్పులకు దోహదపడేందుకు దుబ్బాక ఫలితాలు తోడ్పడినట్టు […]
తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి, అధికార టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కెటిఆర్ అన్నారు. తనపై రాజకీయ కక్షపూరిత పిటిషన్ వేశారని, రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫాంహౌజ్ తనది కాదని స్పష్టం చేసి హైకోర్టుకు కెటిఆర్ నివేదించారు. నిజా […]