Arjun Suravaram
Revanth Reddy Key Decision Yadagirigutta: యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ తరహాలో యాదాద్రి ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలానే మరికొన్ని కీలక అంశాల గురించి అధికారులతో చర్చించారు.
Revanth Reddy Key Decision Yadagirigutta: యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ తరహాలో యాదాద్రి ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలానే మరికొన్ని కీలక అంశాల గురించి అధికారులతో చర్చించారు.
Arjun Suravaram
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి. ఈ దేవస్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంతేకాక యాదాద్రి అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా టీటీడీ బోర్డు తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానంలో కూడా బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
తిరుమల దేవస్థానానికి టీటీడీ బోర్డు ఉన్న సంగతి తెలిసింది. ఆ బోర్డు ఆధ్వర్యంలోనే దేవస్థానానికి సంబంధించిన వ్యహరాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. తిరుమల అభివృద్ధికి సంబధించిన ప్రతి విషయంలోనూ టీటీడీదే తుది నిర్ణయంగా ఉంటుంది. ఇదే తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దేవస్థాన అభివృద్ధి పనులు ముందుకు సాగాలని సీఎం స్పష్టం చేశారు. ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సెక్రటేరియట్ లో సమీక్షించ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యాలు, సదుపాయాలు, అలానే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై వివరాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆలయ రాజగోపురానికి స్వర్ణ తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు మధ్యలో వదిలేయడానికి వీలులేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదికను రిపోర్టు తనకు అందించాని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మరి..టీటీడీ తరహాలో యాదాద్రి విషయంలో బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.