iDreamPost
android-app
ios-app

Heavy Rains: వరదలపై CM రేవంత్ సమీక్ష.. సాయం భారీగా పెంపు.. ఎన్ని లక్షలంటే!

  • Published Sep 02, 2024 | 1:14 PM Updated Updated Sep 02, 2024 | 1:14 PM

CM Revanth Reddy On Heavy Rains, Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు అందించే సాయాన్ని భారీగా పెంచారు. ఆ వివరాలు..

CM Revanth Reddy On Heavy Rains, Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు అందించే సాయాన్ని భారీగా పెంచారు. ఆ వివరాలు..

  • Published Sep 02, 2024 | 1:14 PMUpdated Sep 02, 2024 | 1:14 PM
Heavy Rains: వరదలపై CM రేవంత్ సమీక్ష.. సాయం భారీగా పెంపు.. ఎన్ని లక్షలంటే!

రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రోడ్లు, రైల్వే వంతెనలు, బ్రిడ్జీలు కొట్టుకుపోయి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్థంభించిపోయింది. భారీ వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీదకు వరద నీరు చేరింది. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో.. సర్కర్ అప్రమత్తం అయ్యింది. సహాయక చర్యలు అందించే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వరద సాయాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులతో సోమవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదశాలు జారీ చేశారు. సహాయక చర్యలు అందించడంలో ఏమాత్రం ఆలస్యం, అలసత్వం ప్రదర్శించవద్దని తెలిపారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వరదల వల్ల ఎవరైనా చనిపోతే.. వారి కుటుంబాలకు అందించే నష్టపరిహారాన్ని భారీగా పెంచారు. గతంలో ఇది 4 లక్షల రూపాయలు ఉండగా.. తాజాగా దీన్ని 5 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పశువులు, బర్రెలు, గొర్రెలు చనిపోయినా పరిహారం అందించాలని సూచించారు. ప్రజలను ఆదుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని సూచించారు.