iDreamPost
android-app
ios-app

స్పీడ్ పెంచిన హైడ్రా.. అదనంగా మరో 169 మంది సిబ్బంది

  • Published Sep 26, 2024 | 12:29 PM Updated Updated Sep 26, 2024 | 12:47 PM

HYDRA Demolitions: తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలను మరింత వేగవంతం చేసింది . దానికోసం అదనంగా 169 అధికారులను రంగంలోకి దించుతుంది. తాజాగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

HYDRA Demolitions: తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలను మరింత వేగవంతం చేసింది . దానికోసం అదనంగా 169 అధికారులను రంగంలోకి దించుతుంది. తాజాగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 26, 2024 | 12:29 PMUpdated Sep 26, 2024 | 12:47 PM
స్పీడ్ పెంచిన హైడ్రా.. అదనంగా మరో  169 మంది సిబ్బంది

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ఇతర జలాజయాల భూముల్లో.. అక్రమంగా నిర్మించిన భవనాలపై .. హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందా.. ఎప్పుడు ఏ వార్తా వినాల్సి వస్తుందా అని ప్రజలంతా బిక్కు బిక్కుమంటున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు సంబంధించిన వార్తలను, వీడియో లను మీడియా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధపడుతుంది. ప్రత్యేకించి దీని కోసం 169 మంది అదనపు అధికారులను రంగంలోకి దించింది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

169 అధికారులలో.. ఐదుగురు డీసీపీలు, నలుగురు అడిషనల్ కమిషనర్లు , 16 మంది సబ్ ఇన్సపెక్టర్స్ , 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు , 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ తో పాటు 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్స్ ను డిప్యుటేషన్ పై హైడ్రాకు కేటాయించారు. ఈ వార్తతో రేవంత్ సర్కార్ హైడ్రా కూల్చివేతల విషయంలో మరింత నిక్కచ్చిగా ఉన్నట్లు అర్ధమౌతుంది. హైదరాబాద్ నగర పరిధిలో ఉండే చెరువులు , నాలాలతో పాటు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన భవనాలను , విల్లాలను.. క్షణాల్లో నేలమట్టం చేసి.. ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికి పూర్తిగా నిర్మాణం పూర్తయ్యి.. నివాసం ఉంటున్న వారి ఇళ్ళు మాత్రం కూల్చకుండా.. వారికి నోటీసులు ఇస్తాం అని స్పష్టం చేశారు. ఇలా ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా కట్టిన అక్రమ కట్టడాలను.. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా సిబ్బంది నేలమట్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో వేచి చూడాలి.

అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ భూములతో పాటు.. పార్కుల స్థలాలను కూడా కాపాడే పనిలో హైడ్రా నిమగ్నమైంది. అంతే కాకుండా ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించడానికి రుణాలు ఇస్తే.. పేదవారికి న్యాయం జరిగేలా చూస్తాం అని కూడా రంగనాథ్ చెప్పారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఇకపై నగరం అంతా ఏకకాలంలో కూల్చివేతలు జరగనున్నాయి. త్వరలో ముఖ్యమైన వ్యక్తుల విల్లాలు , కాలేజీలు కూల్చివేయనుంది హైడ్రా. దీనితో ఏ ఏ ప్రాంతాలలో ఈ కూల్చివేతలు జరగనున్నాయని ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక ప్రస్తుతం హైడ్రా మూసి రివర్ ఆక్రమణల కూల్చివేతలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ శని ఆదివారాల్లో భారీగా కూల్చేవేతలు కొనసాగించనుంది. రెండు రోజుల్లో అంతా నేలమట్టం చేసేలా టార్గెట్ పెట్టుకుంది హైడ్రా.. అందుకోసమే హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.