Dharani
Telangana Govt-Merge Villages In Municipalities: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో 51 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఆ వివరాలు..
Telangana Govt-Merge Villages In Municipalities: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో 51 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. దూకుడుగా ముందుకు సాగుతుంది. ఓవైపు ఎన్నికల హామీలను నెరవేరుస్తూనే.. మరోవైపు ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగుతుంది. ఇప్పటికే నగరంలో ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా దాన్ని రాష్ట్రం మొత్తం విస్తరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం తీసకున్న నిర్ణయంతో 51 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే..
హైడ్రా వ్యవస్థ ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల సుమారు 51 గ్రామాల తలరాత మారనుంది. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే.. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాక తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. 51 పంచాయతీల రికార్డులు.. మున్సిపల్ అధికారుల చేతుల్లోకి రానున్నాయి. వీటిని డినోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్, రాయలపూర్ గ్రామాలు రానున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర, యదగిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి, చిర్యాల, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. పోచారం మున్సిపాలిటీలోకి బోగారం, గోధుమకుంట, కరీంగూడా, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం, కొర్రెముల, కాచవానిసింగారం, చౌదరిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి.
అలానే ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి అంకుశపూర్, ఔషాపూర్, మందారం, ఎదులాబాద్, ఘనపూర్, మఱిప్యాల్ గూడ గ్రామాలు విలీనమవ్వనున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి మునిరాబాద్, గౌడవెల్లి గ్రామాలు రానున్నాయి. వీటితో పాటు తుంకుంట మున్సిపాలిటీలోకి బొంరాస్ పేట, శామిర్ పేట, బాబాగుడా గ్రామాలు రానున్నాయి. అమీన్‌పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తండా, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, దాయర, సుల్తాన్పూర్ గ్రామాలు.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి.
ఇక.. పటాన్‌చెరు మండల పరిధిలోని పాటి, కర్ధనూరు, ఘనపూర్, పోచారం, ముత్తంగి గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి. ఈ గ్రామాలకు సంబంధించిన పంచాయతీల రికార్డులు.. మున్సిపల్ అధికారుల చేతుల్లోకి రానున్నాయి. ఆయా గ్రామాలను డినోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణంతో ఈ 51 గ్రామాల తలరాత మారనుంది అంటున్నారు.