iDreamPost
android-app
ios-app

వినాయక మండపాలు పెట్టే వారికి.. CM రేవంత్ రెడ్డి శుభవార్త!

Revanth Reddy,Vinayaka Chavithi Festival: గణేష్ ఉత్సవాల నిర్వహణపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షి నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారికి ఓ శుభవార్తను అందించారు.

Revanth Reddy,Vinayaka Chavithi Festival: గణేష్ ఉత్సవాల నిర్వహణపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షి నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారికి ఓ శుభవార్తను అందించారు.

వినాయక మండపాలు పెట్టే వారికి.. CM రేవంత్ రెడ్డి శుభవార్త!

హిందూవులు  ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ఏటా ఈ పండగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. వీధుల్లో, గ్రామాల్లో, ఆలయాల్లో గణేషులు మండపాలను ఎంతో అందంగా అలకరించి..పూజలు నిర్వహిస్తుంటారు. ఇక పిల్లల, పెద్దలు భక్తి శ్రద్ధలతో గణనాథుడిని పూజిస్తారు. ఇది ఇలా ఉంటే..గణేష్ మండపాలు ఏర్పాటు విషయంలో అధికారులు, పోలీసులు నిబంధనలు విధిస్తుంటారు. అలానే ఈ సారి కూడా గణేష్ మండపాలను ఏర్పాటు చేసే వారికి ముఖ్య సూచనలు చేశారు. ఇది ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసే వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

గణేష్ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్షించా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ రాష్ట్రంలో ఉన్నాతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి,  నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించేందుకే ఈ సమాశావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

CM Revanth Reddy's good news for those who put Vinayaka mandapams!

హైదరాబాద్ తో పాటు ఇతర నగరంలో కూడా ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరిగా  తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటూ నిర్వహాకులకు గుడ్ న్యూస్ చెప్పారు. వినాయక మండపాలకు ఫ్రీ కరెంట్ అందించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం తెలిపారు. తమ వద్దకు దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులకు సూచించారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో గణేష్ ఉత్సవాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గణేషుడి మండపాల ఏర్పాటు విషయంలో ఇప్పటికే పోలీసులు కీలక సూచనలు, రూల్స్ పెట్టిన సంగతి తెలిసింది. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రయివేటు స్థల యజమానుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు అని ధ్రువీకరిస్తూ.. నో అబ్జెక్టన్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేయకూడదని, మండపాలకు అవసరమైన విద్యుత్తు కనెక్షన్‌ కోసం విద్యుత్తు శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు మండపాల వద్ద లౌడ్‌స్పీకర్ల నిషేధం ఉంటుందని తెలిపారు. అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలుగా మండపాల్లోఅగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటితోపాటు పలు రూల్స్ ను పోలీసులు జారీ చేశారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి నిబంధనల విషయంలో ఇంకా ఏవైనా సందేహాలుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్, లేదా 8712665785 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. తాజాగా గణేష్ మండపాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి..రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.