Arjun Suravaram
HYDRA, Revanth Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు.. హైడ్రా. చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణ విషయంలో హైడ్రా దుమ్ములేపుతోంది. ఇక హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు మెచ్చుకునే సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.
HYDRA, Revanth Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు.. హైడ్రా. చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణ విషయంలో హైడ్రా దుమ్ములేపుతోంది. ఇక హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు మెచ్చుకునే సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.
Arjun Suravaram
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రత్యేక శైలీలో వెళ్తున్నారు. పరిపాలన విషయంలో తరచూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందారు. ఇది ఇలా ఉంటే..ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు ఉంటున్నాయి. తాజాగా హైడ్రా విషయంలో అదే జరుగుతుంది. ఇప్పటి వరకు ఆయనపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు కూడా హైడ్రా విషయంలో గురువారం చోటుచేసుకున్న పరిణామంతో శభాష్ సీఎం అంటూ మెచ్చుకుంటున్నారు.
హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల్లో జరిగిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా ను తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఆ వ్యవస్థ దూసుకెళ్తోంది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా ఝూళిపిస్తోంది. చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలను, ఇతర నిర్మాణాలను నిర్దాక్షణ్యంగా కూల్చి వేస్తుంది. అక్రమ నిర్మాణాలు అని తెలిస్తే..చాలు క్షణాల్లో నేలమట్టం చేస్తున్నారు.
అలా నగరంలోని చెరువుల,జలాశయాల పరిరక్షణకు హైడ్రా రూపంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఇక అక్రమం నిర్మాణాలను చేపట్టిన వారు ఎంతటి ప్రముఖలైన సరై, వారి ఎలాంటి పవర్స్ ఉన్న సరే..హైడ్రా విడిచిపెట్టడం లేదు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లాంటి ప్రముఖ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చేసింది. ఇక పలువురు ప్రజాప్రతినిధుల విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వారి వివరణ ఆధారంగా తదుపరి చర్యలకు హైడ్రా సిద్ధంగా ఉంది.
తనకు రాజకీయంగా అనేక ఇబ్బందులు వస్తాయని తెలిసిన కూడా సీఎం రేవంత్ రెడ్డి చెరువుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణల కూల్చివేతల విషయంలో ప్రతిపక్షాలు సీఎం రేవంత్ రెడ్డిపై అనేక విమర్శలు చేశాయి. సొంత పార్టీ వారికి, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన నిర్మాణల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదని, కేవలం ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ గా చేసుకున్నారని తెలిపారు. ఇది ఇలా ఉంటే..తనకు భగవద్గీతే స్పూర్తి అని.. అందులో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే తనకు ఆదర్శమని రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో తెలిపారు. ప్రకృతిని మనం రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుందని లేకుంటే.. ఆ ప్రకృతి ఉగ్రరూపానికి బలవుతామంటూ సీఎం చెప్పుకొచ్చారు. అలానే చెరువుల పరిధిలో తన పార్టీ, తన కుటుంబ సభ్యులతో సహా ఎవరికి సంబంధించిన నిర్మాణాలు ఉన్న కూడా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ హైడ్రా అనేది పార్టీలకు, బంధుత్వాలకు అతీతంగా తన పని తాను చేసుకెళ్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా నోటీసులు వెళ్లాయి. అంతేకాక ఆయన కూడా హైడ్రా నోటీసులకు సానుకూలంగా వివరణ ఇచ్చారు. ఇలా ఏకంగా సీఎం సోదరుడికే నోటీసులు ఇచ్చి..హైడ్రా తన ఎలా ముందుకెళ్తోందో అందరికి తెలియజేసింది. దీంతో ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు సైతం ఆయనను మెచ్చుకుంటున్నాయి. ఇలా మొత్తంగా తనదైన చర్యలతో అన్ని వర్గాలు, అన్ని పార్టీల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నారు. మరి.. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.