iDreamPost
android-app
ios-app

కూల్చివేతలపై హైడ్రా సంచలన నివేదిక! కీలక అంశాలు ఇవే..

HYDRAA: బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధిచిన వివరాలను వెల్లడించారు.  

HYDRAA: బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధిచిన వివరాలను వెల్లడించారు.  

కూల్చివేతలపై హైడ్రా సంచలన నివేదిక! కీలక అంశాలు ఇవే..

హైడ్రా.. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించిన పేరు. హైదరాబాద్ లో గతకొన్ని రోజులుగా అక్రమదారులకు హైడ్రా ఏ స్థాయిలో హడలెత్తిస్తోందో అందరికి తెలిసిందే. నగరంలోని చెరువులు, కుంటలు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ విషయంలో సామాన్యులు, ధనికులు అనే తేడా లేకుండా.. రూల్స్ భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలను నిర్ధాక్ష్యణ్యంగా కూల్చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో రోజుకొక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, నోటిసులు ఇచ్చిన రోజుల వ్యవధిలోనే.. బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతుంది.  ఈ నేపథ్యంలోనే కూల్చివేతలకు సంబంధించి హైడ్రా  సెన్సేషనల్ రిపోర్టు ఇచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధిచిన వివరాలను వెల్లడించారు.  జూన్ 27 నుంచి ఇప్పటివరకూ మొత్తం 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. అలానే 111.72 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం పరిధిలోని 23 ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను, ఇతర నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. జూన్ 27న ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ లోని ప్లాట్ నెంబర్ 30తో  అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాని తెలిపారు. అలానే ఇటీవల దుండిగల్ మండలం మల్లంపేట్ గ్రామంలోని 13 విల్లాల కూల్చివేతల వరకూ కొనసాగిందని తెలిపారు.

రాబోయే రోజుల్లో మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖల భవనాలను సైతం హైడ్రా వదల్లేదు. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను సైతం హైడ్రా కూల్చేసింది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన వాటిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. FTL, బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ హైడ్రా నేల మట్టం చేస్తోంది. ఇక హైడ్రా చేస్తున్న ఈ పనిపై  ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది.

దీంతో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రా మరింత యాక్టీవ్ గా పని చేసేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తుంది. చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారికి అధికారులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఉంది.  రాబోయే రోజుల్లో అన్ని డిపార్టుమెంట్లను ఒకేచోటికి తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా తాజాగా ఇప్పటి వరకు చేపట్టిన  అక్రమ నిర్మాణల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ తెలిపిన వివరాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.