iDreamPost
android-app
ios-app

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ ఫ్రీగా భోజనం: ఆమ్రపాలి!

Hyderabad News: హైదరాబాద్ నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీన పెద్ద ఎత్తున తరలిరానున్న గణేషులతో పాటు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నగర వాసులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పంది.

Hyderabad News: హైదరాబాద్ నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీన పెద్ద ఎత్తున తరలిరానున్న గణేషులతో పాటు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నగర వాసులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పంది.

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ  ఫ్రీగా భోజనం: ఆమ్రపాలి!

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా గణేషుడి పండుగు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో జరిగే వినాయక చవితి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గణేష్ నిమజ్జనాల కోలాహలం మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా గణనాథుడి విగ్రహాలు ప్రతిష్ఠించగా మూడో రోజు నుంచే నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. అయితే సెప్టెంబర్ 17వ తేదీన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. అదే రోజు నగరంలో ఉన్న భారీ గణనాథులు కూడా హుస్సేన్ సాగర్ కు క్యూ కట్టనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీన పెద్ద ఎత్తున తరలిరానున్న గణేషులతో పాటు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన సందర్భంగా జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను ప్రస్తావించారు. గణేష్ నిమజ్జనానికి జీహెచ్ ఎంసీ తరపున అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు.

సెప్టెంబర్ 17వ తేదీతో పాటు 18, 19 తేదీల్లో మొత్తంగా మూడు రోజులపాటు 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ తో సహా పలు ముఖ్యమైన చెరువుల వద్ద శానిటేషన్ సిబ్బంది,గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గణేషుడి నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం ట్యాంక్‌ బండ్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో మంచినీళ్లు, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జనాల వేళ జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. ఈసారి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. భక్తులకు జీహెచ్ఎంసీ తరపున ఉచితంగా భోజనం అందించనున్నట్టు ఆమ్రపాలి తెలిపారు. మరోవైపు.. శోభాయాత్రలు నిర్వహించే రహదారులను ఇప్పటికే మరమ్మత్తులు చేశామని తెలిపారు.

ఆయా మార్గాల్లో స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని అన్ని ప్రధాన చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీస్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని ఆమ్రపాలి తెలిపారు. ఇది ఇలా ఉంటే..ఈ మహా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. నిమజ్జనం రోజున స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటిస్తుండటించిన సంగతి తెలిసింది. మొత్తంగా గణేషుడి నిమజ్జనంపై జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.