సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ థియేటర్ల దగ్గర భారీ కళ కనిపించడం లేదు. లాక్ డౌన్ అయ్యాక హాళ్లు తెరిచిన తర్వాత చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చిన సినిమాలు కొన్నే. ఎస్ఆర్ కళ్యాణమండపం, లవ్ స్టోరీ, రాజరాజ చోర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు మాత్రమే నిర్మాతలకు లాభాలు ఇచ్చాయి. మిగిలినవన్నీ అంతో ఇంతో నష్టాన్ని తెచ్చినవే. మొన్న శుక్రవారం వచ్చిన పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి, ఎనిమి ఏవీ కూడా యునానిమస్ గా జనాన్ని ఆకట్టుకోలేదు. బ్రేక్ […]
తెలుగు నేలకు సినిమాలను ఎంత అవినావ సంబంధం ఉందో ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమవుతోంది. ఏప్రిల్ లో కరోనా సెకండ్ వేవ్ పూర్తయ్యాక థియేటర్లు తెరవాలా వద్దా అని ప్రభుత్వాలు ఆందోళన చెందుతుంటే ఏపి తెలంగాణలో మాత్రం ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇతర బాషలకు రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తోందన్న మాట వాస్తవం. దానికి సాక్ష్యంగా వసూళ్లు నిలుస్తున్నాయి. జూలై ఆఖరులో సినిమా హాళ్లు తెరుచుకున్నాక ఎస్ఆర్ కల్యాణ మండపం లాంటి చిన్న సినిమా ఏకంగా 8 […]
సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్ మధ్య బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన అల వైకుంఠపురములో ఫైనల్ రన్ కు వచ్చేసింది . కొన్ని కీలకమైన సెంటర్లు మినహాయించి దాదాపు అన్ని చోట్ల సెలవు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు అల వైకుంఠపురములో 150 కోట్ల 40 లక్షల షేర్ తో నాన్ బాహుబలి కిరీటాన్ని దర్జాగా తీసుకుంది. ప్రచారం విషయంలో రికార్డులు మావంటే మావని సరిలేరు నీకెవ్వరు టీం పోటీ పడినప్పటికీ ఫైనల్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సరిలేరు నీకెవ్వరు దాదాపు అన్ని చోట్ల ఫుల్ రన్ పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేయడంతో పాటు జెమిని ఛానల్ లో అతి త్వరలో అని ప్రోమోలు రావడం మొత్తానికి దీని కలెక్షన్లను క్లైమాక్స్ కు తెచ్చేసింది. అల వైకుంఠపురములో నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకున్న మహేష్ మూవీ దానికి ధీటుగా పోటీ ఇచ్చినప్పటికీ వసూళ్లలోనూ, ఫిఫ్టీ డేస్ […]
విశ్వక్ సేన్ హీరోగా న్యాచురల్ స్టార్ నిర్మాతగా రూపొందిన హిట్ మూడు రోజుల ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. టాక్ మిక్స్డ్ గానే ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఇంకో ఆప్షన్ లేకపోవడంతో క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు హిట్ కే ఓటు వేస్తున్నారు. మొదటి మూడు రోజులను చక్కగా వాడుకున్న హిట్ జరిగిన బిజినెస్ లెక్కల్లో చూసుకుంటే డీసెంట్ గానే రాబట్టుకుంది. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు హిట్ ఇప్పటిదాకా 3 కోట్ల 17 […]
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా రూపొందిన హిట్ నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రమోషన్ టైంలో బాగానే హైప్ తెచ్చుకున్న ఈ మూవీకి పర్వాలేదు అనే ఓపెనింగ్ దక్కింది. విశ్వక్ సేన్ కు ప్రత్యేకంగా ఇమేజ్ అంటూ లేకపోవడం, ఈ జానర్ సినిమాలకు మాస్ దూరంగా ఉండటం లాంటి కారణాల వల్ల కేవలం 1 కోటి 15 లక్షలకే హిట్ పరిమితమయ్యింది. జరిగిన బిజినెస్ జస్ట్ 5 కోట్లే కాబట్టి ఇది ఒక […]
గత వారం విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన భీష్మ ఊహించినట్టే నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా మారింది. మొదటి వీకెండ్ కే పెట్టుబడిని ఇచ్చేసిన భీష్మతో ఇప్పుడొచ్చేవన్నీ లాభాలే. ఫస్ట్ వీకెండ్ కి 23 కోట్ల 51 లక్షల షేర్ రాబట్టి ఇంకా స్ట్రాంగ్ గానే రన్ అవుతోంది. నైజామ్ లో అత్యధికంగా 7 కోట్ల 50 లక్షల షేర్ తో మీడియం రేంజ్ హీరోల్లో నితిన్ కొత్త మార్క్ […]
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ తో జనం తిరస్కారానికి గురైన ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు యూనిట్ కనీసం పోస్ట్ పబ్లిసిటీ ప్రమోషన్లు కూడా చేసుకోలేకపోయింది. నిర్మాత కేఎస్ రామారావు హీరోనే రీఫండ్ అడుగుతారని వచ్చిన వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాన కేంద్రాల్లో ఏదోలా లాగిస్తున్నా ఇప్పటికే […]
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తోంది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ ని అనుకూలంగా మలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి 14 కోట్ల 59 లక్షల షేర్ ఇచ్చిన భీష్మ రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకొని ఆపై అంతా లాభాలు ఇచ్చేలా ఉన్నాడు. రైతులను ప్రోత్సహించే ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ యూత్ ఫామిలీస్ మెచ్చేలా కామెడీ యాక్షన్ […]
నిర్మాతకు హీరో హీరొయిన్లకు విడుదలకు ముందు విపరీతమైన ఆశలు రేకెత్తించిన జాను ఫైనల్ రన్ కు వచ్చేసింది. తమిళ్ కల్ట్ క్లాసిక్ 96కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం రిజల్ట్ మాత్రం ఒరిజినల్ కు అచ్చంగా రివర్స్ లో వచ్చింది. సుమారు 19 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న జాను క్లోజింగ్ లో కేవలం 8 కోట్లు కూడా అందుకోలేకపోవడంతో అరవై శాతం పైగా నష్టాలు తప్పలేదు. శర్వానంద్, సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ […]