iDreamPost
android-app
ios-app

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘ఆయ్’..3వ రోజు ఏకంగా!

  • Published Aug 18, 2024 | 11:25 AM Updated Updated Aug 18, 2024 | 11:25 AM

AAY Movie 3rd Day Collections: తారక్ బావమరిది నితిన్ నార్నె రెండో సినిమా ఆయ్. రెండు పెద్ద సినిమాల మధ్యన ఈ సినిమాను రిలీజ్ చేసి.. ఇండిపెండెన్స్ డే మూవీ రిలేజెస్ లో మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా నిలిచిపోయింది.. ఈ మూవీ. మరి ఈ మూవీ 3వ రోజు కలెక్షన్స్ చూసేద్దాం.

AAY Movie 3rd Day Collections: తారక్ బావమరిది నితిన్ నార్నె రెండో సినిమా ఆయ్. రెండు పెద్ద సినిమాల మధ్యన ఈ సినిమాను రిలీజ్ చేసి.. ఇండిపెండెన్స్ డే మూవీ రిలేజెస్ లో మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా నిలిచిపోయింది.. ఈ మూవీ. మరి ఈ మూవీ 3వ రోజు కలెక్షన్స్ చూసేద్దాం.

  • Published Aug 18, 2024 | 11:25 AMUpdated Aug 18, 2024 | 11:25 AM
బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘ఆయ్’..3వ రోజు ఏకంగా!

మ్యాడ్ మూవీతో అందరికి పరిచయం అయిన… తారక్ బావమరిది నితిన్ నార్నె. ఇప్పుడు ఆయ్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎక్కడా కూడా తారక్ ఇమేజ్ వాడుకోకుండా .. ఇలా మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఆగష్టు 15న రెండు పెద్ద సినిమాల మధ్యన.. ఆయ్ సినిమాను రిలీజ్ చేసి సాహసం చేశారు. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ కు ముందు అంత బజ్ లేకపోయినా సరే.. ఊహించని విధంగా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడం విశేషం. మరి ఈ మూవీ మూడో రోజు ఎలాంటి కలెక్షన్స్ ను రాబట్టిందో చూసేద్దాం.

ఆయ్ సినిమా నుంచి మొదట వచ్చిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై.. డీసెంట్ హైప్ నే క్రియేట్ చేశాయి. కానీ ఈ సినిమాతో పాటు మరో రెండు హై బడ్జెట్ మూవీస్ రిలీజ్ అవ్వడంతో.. ఆయ్ సినిమాపై కాస్త ఫోకస్ తగ్గింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ ను కలుపుకుని.. ఈ సినిమాకు రూ. 3.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా రిలీజ్ అయినా మొదటి షో నుంచి.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ.. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.72 కోట్లు షేర్, రూ. 3.25 కోట్లు గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకోగా.. మూడో రోజు రెస్పాన్స్ ఇంకాస్త పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.05 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా మూడో రూ. 1.10 కోట్లు రాబట్టింది. చూడబోతుంటే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేలా ఉంది.

పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ , మనసారా నవ్వించే కామెడీ.. ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారనిపిస్తుంది. ఇలాంటి ఓ కాన్సెప్ట్ తో చిన్న సినిమాగా థియేటర్ లో ఎంటర్ అయినా కూడా.. భారీ రెస్పాన్స్ నే సంపాదించుకుంటుంది ఆయ్ మూవీ. ఈ సినిమాను కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించగా.. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది కలిసి ఈ మూవీని నిర్మించారు. రోజు రోజుకి మూవీ కలెక్షన్స్ మరింతగా పెరుగుతున్నాయి. కాబట్టి లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్టన్స్ రాబడుతుందో చూడాలి. మరి ఆయ్ మూవీ మూడవ రోజు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap