iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారం.. 3వ రోజే ఊహించని లాభాలతో సరిపెట్టారు

  • Published Sep 01, 2024 | 2:40 PM Updated Updated Sep 01, 2024 | 2:40 PM

saripodhaa sanivaaram Movie day 3 collections: రీసెంట్ గా నాని నటించిన సరిపోదా శనివారం సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో .. దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు ఈ మూవీ భారీ కలెక్షన్స్ సాధించగా.. మూడవ రోజు లాభాల్లోకి ఎంటర్ అయిపొయింది. మరి ఈ సినిమా మూడవ రోజు కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం.

saripodhaa sanivaaram Movie day 3 collections: రీసెంట్ గా నాని నటించిన సరిపోదా శనివారం సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో .. దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు ఈ మూవీ భారీ కలెక్షన్స్ సాధించగా.. మూడవ రోజు లాభాల్లోకి ఎంటర్ అయిపొయింది. మరి ఈ సినిమా మూడవ రోజు కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం.

  • Published Sep 01, 2024 | 2:40 PMUpdated Sep 01, 2024 | 2:40 PM
సరిపోదా శనివారం..  3వ రోజే  ఊహించని లాభాలతో సరిపెట్టారు

వివేక్ ఆత్రేయ , నాని కాంబినేషన్ లో వచ్చిన సినిమా.. ఆగష్టు 29 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఆగష్టు నెలలో రిలీజ్ అయినా స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా భారీ అంచనాల మధ్యన థియేటర్ లో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఈ సినిమాలు ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో అందరి అంచనాలు నాని సినిమాపైనే ఏర్పడ్డాయి. ఇక అంచనాలకు తగినట్టే ఈ మూవీ మొదటి షో నుంచే మంచి టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మూడురోజుల్లోనే ఈ మూవీ.. లాభాల బాట పట్టింది. మరి ఈ సినిమా మూడవ రోజు ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

నాని సరిపోదా శనివారం మూవీ.. రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన నాని… మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా వసూళ్లను సాధించగా.. రెండవ రోజు 15 కోట్ల రూపాయలు సాధించింది. ఇక మూడవ రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ సినిమాకు 204K టికెట్లు బుకింగ్ కాగా .. ఏపీ, నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో 1.5 మిలియన్ వసూళ్లను సాధించి ఓవర్సీస్ లో 3వ రోజు బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సలో సుమారు 13 కోట్ల రూపాయలను వసూలు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 8.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదే జోరు కనుక కొనసాగితే వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ దాటేస్తుంది. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా కలెక్షన్స్ తగ్గినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమౌతుందో వేచి చూడాలి మరి.

ఆల్రెడీ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో .. అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. కథ , కాన్సెప్ట్ పరంగా సినిమా బాగానే ఉన్నా కూడా.. కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఇదే డైరెక్టర్ తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చి హిట్ కొట్టేశాడు నాని . సాధారణంగానే నాని సినిమాలపై అందరికి అంచనాలు బాగానే ఉంటాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాడంటే కచ్చితంగా అందులో ఎదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించేది కూడా ఇదే. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ మూడవ రోజు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet