iDreamPost
android-app
ios-app

Manamey: ఫస్ట్‌ డే కన్నా రెండో రోజు భారీగా.. కలెక్షన్స్‌లో దూసుకుపోతున్న మనమే

  • Published Jun 09, 2024 | 6:44 PM Updated Updated Jun 09, 2024 | 6:44 PM

శర్వానంద్‌, కృతిశెట్టి జంటగా నటించిన మనమే చిత్రం.. రెండో రోజు భారీగా కలెక్షన్స్‌ సాధించింది. ఆ వివరాలు..

శర్వానంద్‌, కృతిశెట్టి జంటగా నటించిన మనమే చిత్రం.. రెండో రోజు భారీగా కలెక్షన్స్‌ సాధించింది. ఆ వివరాలు..

  • Published Jun 09, 2024 | 6:44 PMUpdated Jun 09, 2024 | 6:44 PM
Manamey: ఫస్ట్‌ డే కన్నా రెండో రోజు భారీగా.. కలెక్షన్స్‌లో దూసుకుపోతున్న మనమే

ఈవారం పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాలేదు. వచ్చిన సినిమాల్లో కాస్త ఆస​క్తి కలిగి ఉన్న చిత్రం ఏదైనా ఉందా అంటే.. అది శర్వానంద్‌ నటించిన మనమే మూవీ. ప్రముఖ దర్శకుడు డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్.. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. మనమే సినిమాలో ఏకంగా 16 పాటలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి క్లీన్‌ చిట్‌ వచ్చింది. మనమే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి ఎంతో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కథ అంతా ఓ చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. ఇక సినిమాలో శర్వానంద్, చిన్న పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ ఎంతో హిలేరియస్‌గా, కామెడీగా ఉన్నాయి అంటున్నారు చిత్రం చూసిన ప్రేక్షకులు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాక సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. మొత్తానికి సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా మొదటి రోజున 55 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. అయితే ఏ సినిమాకు అయినా సరే.. తొలి రోజు భారీ వసూళ్లు వస్తాయి. కానీ మనమే సినిమాకు మాత్రం మొదటి రోజు కన్నా కూడా రెండో రోజే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. మనమే సినిమాకు రెండో రోజు 67 వేల టికెట్స్ బుక్ అయ్యాయి. దీనితో మనమే మూవీ మొదటి రోజు కంటే రెండో రోజు 21 శాతం ఎక్కువగా టికెట్స్ అమ్ముడయ్యాయి. దాంతో ఈ సినిమాకు మొదటి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇక మనమే మూవీ ఈ రెండు రోజుల్లో 3.40 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇదే పంథా కొనసాగితే.. సినిమా మంచి కలెక్షన్స్‌ సాధిస్తుందని అంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş