iDreamPost
android-app
ios-app

కోట్ల వర్షం కురిపిస్తున్న తంగలాన్.. 3వ రోజు ఎన్ని కోట్లంటే?

  • Published Aug 18, 2024 | 11:46 AM Updated Updated Aug 18, 2024 | 11:46 AM

Thangalaan Movie 3rd Day Collections: చియాన్ విక్రమ్ కు ఉన్న సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఆగస్ట్ 15న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తో దూసుకుపోతూ..బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తుంది. మరి ఈ మూవీ మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

Thangalaan Movie 3rd Day Collections: చియాన్ విక్రమ్ కు ఉన్న సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఆగస్ట్ 15న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తో దూసుకుపోతూ..బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తుంది. మరి ఈ మూవీ మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

  • Published Aug 18, 2024 | 11:46 AMUpdated Aug 18, 2024 | 11:46 AM
కోట్ల వర్షం కురిపిస్తున్న తంగలాన్.. 3వ రోజు ఎన్ని కోట్లంటే?

దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్ లో.. విక్రమ్ కెరీర్‌లో 61వ చిత్రంగా వచ్చిన సినిమా తంగలాన్. స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు పోటీగా ఆగస్ట్ 15 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ విడుదలైన అన్ని ప్రాంతాల్లో కూడా పాజిటివ్ బజ్ తో దూసుకుపోతుంది. అలాగే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ఈ మూవీ. ముఖ్యంగా తమిళ నాట ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తుంది . మొదటి రెండు రోజుల్లోనే ఈ మూవీకి మొత్తం మీద రూ. 34 కోట్ల కలెక్షన్స్ రాగా.. మూడవ రోజు కూడా అదే జోరు కొనసాగుతుంది. మరి తంగలాన్ మూవీ మూడవ రోజు కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తంగలాన్ సినిమాను .. సుమారు రూ.140 కోట్ల తో రూపొందించారు. ఈ క్రమంలో ఈ మూవీ అనుకున్నట్లుగానే భారీ స్పందన లభిస్తుంది. తమిళ వెర్షన్ లో మొదటి రోజు రూ. 12 కోట్లు, రెండో రోజు రూ.4కోట్లు.. అలాగే తెలుగు వెర్షన్ లో మొదటి రోజు రూ. 1.5 కోట్లు.. రెండో రోజు రూ.1 కోటి వసూళ్లు చేయగా.. మూడు రోజు కలెక్షన్స్ ఇంకాస్త పెరిగాయి. తమిళంలో రూ.5.2 కోట్లు, తెలుగులో 70 లక్షలు.. ఇక మలయాళం , కన్నడ అంతా కలుపుకుని వరల్డ్ వైడ్ గా.. ఈ సినిమాకు రూ.40 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. వీకెండ్ అయ్యే లోపు రూ.50 కోట్లు వసూళ్లు చేసే అవకాశం లేకపోలేదు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.

5వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో.. బంగారు నిధుల అన్వేషణ కోసం.. ఆయా ప్రాంతాలలో నివశించే గిరిజన తెగల వారికి .. అక్కడి భూస్వాములు, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టె వారు.. అనే కాన్సెప్ట్ పై ఈ సినిమాను రూపొందించారు. సాధారణంగా చరిత్ర తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబాట్టి ఆ కోణంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక లాంగ్ లో ఈ మూవీ ఎంత వరకు కొనసాగుతుందో.. వేచి చూడాలి. మరి తంగలాన్ మూవీ మూడవ రోజు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.