iDreamPost
android-app
ios-app

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం డే 1 కలెక్షన్స్‌.. నాని మాస్‌ కుమ్ముడు ఇది.. తొలి రోజే అన్ని కోట్లు

  • Published Aug 30, 2024 | 8:53 AM Updated Updated Aug 30, 2024 | 9:07 AM

Saripodhaa Sanivaaram First Day Collections: నాని సరిపోదా శనివారం సినిమా డే 1 కలెక్షన్స్‌ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇంతకు ఫస్ట్‌ డే నాని ఎంత కలెక్ట్‌ చేశాడంటే..

Saripodhaa Sanivaaram First Day Collections: నాని సరిపోదా శనివారం సినిమా డే 1 కలెక్షన్స్‌ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇంతకు ఫస్ట్‌ డే నాని ఎంత కలెక్ట్‌ చేశాడంటే..

  • Published Aug 30, 2024 | 8:53 AMUpdated Aug 30, 2024 | 9:07 AM
Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం డే 1 కలెక్షన్స్‌.. నాని మాస్‌ కుమ్ముడు ఇది.. తొలి రోజే అన్ని కోట్లు

కూల్‌, రొమాంటిక్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచే హీరో నాని.. అప్పుడప్పుడు భిన్నమైన ప్రయోగాలు చేస్తుంటాడు. దీనిలో భాగంగానే గతంలో దసరా అనే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాడు. ఆ తర్వాత మళ్లీ హాయ్‌ నాన్న అంటూ రొమాంటిక్‌, ఎమోషనల్‌ డ్రామాతో ప్రేక్షకులను కట్టి పడేశాడు. ఇక తాజాగా మరోసారి తన రూటు మార్చి.. సరిపోదా శనివారం అంటూ.. ఊర మాస్‌ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయ్యింది. దీనిలో నాని కాగా.. దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య విలన్‌ పాత్రలో మెప్పించాడు. ఇక నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది.

విడుదలకు ముందు నుంచే సరిపోదా శనివారంపై భారీ ఎత్తున అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఆ జోరు కనిపించింది. సినిమా మీద హైప్‌ పెరగడంతో.. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగానే జరిగింది. వరల్డ్‌వైడ్‌గా సరిపోదా శనివారం రూ.41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.. అంటే రూ.42 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ అన్న మాట. ఇక అమెరికాలో సరిపోదా శనివారం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగా జరిగాయి. ప్రీమియర్స్ కోసం 17 వేల టికెట్లు బుక్ అయినట్లుగా టాక్.

అమెరికాలోని 415 లోకేషన్స్‌లో ప్రీమియర్స్ పడగా.. అడ్వాన్స్ బుకింగ్స్ కింద ఈ సినిమాకు 3,12,356 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.2,62,26,284 వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఇండియాలో కూడా సరిపోదా శనివారం కలెక్షన్స్‌ సూపర్‌గా ఉన్నాయని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షో కలెక్షన్స్ పరంగా చూస్తే సరిపోదా శనివారం చిత్రం నాని రేంజ్‌ను పెంచేలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

పైగా సినిమాకు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో.. సెకండ్‌ డే నాడు కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ లెక్కన సరిపోదా శనివారం రూ.8-రూ.9 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్ షేర్‌ను రాబట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లపైనే గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని భావిస్తున్నారు. వీకెండ్‌లో ఈ జోరు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి నాని ఖాతాలో మరో హిట్టు పక్కా అంటున్నారు.