iDreamPost

Kalki Collections: కల్కి ఫస్డ్‌ డే కలెక్షన్స్‌.. ప్రభాస్‌ రేంజ్‌ అంటే ఇది

  • Published Jun 28, 2024 | 8:53 AMUpdated Jun 28, 2024 | 9:06 AM

Kalki 2898 AD First Day Collections: భారీ బడ్జెట్‌, తారాగణం, అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్‌ కల్కి చిత్రం.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే బ్లాక్‌ బాస్టర్‌ హిట్టు టాక్‌ తెచ్చుకుంది. మరి తొలి రోజు కల్కి ఎంత వసూలు చేశాడంటే..

Kalki 2898 AD First Day Collections: భారీ బడ్జెట్‌, తారాగణం, అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్‌ కల్కి చిత్రం.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే బ్లాక్‌ బాస్టర్‌ హిట్టు టాక్‌ తెచ్చుకుంది. మరి తొలి రోజు కల్కి ఎంత వసూలు చేశాడంటే..

  • Published Jun 28, 2024 | 8:53 AMUpdated Jun 28, 2024 | 9:06 AM
Kalki Collections: కల్కి ఫస్డ్‌ డే కలెక్షన్స్‌.. ప్రభాస్‌ రేంజ్‌ అంటే ఇది

కల్కి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కలవరిస్తున్న పేరు. దాదాపు నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని.. బ్లాక్‌ బాస్టర్‌ హిట్టుగా నిలిచింది. భారతీయ సినీ చరిత్రలో కల్కి ఓ కలికితురాయి అని అంటున్నారు సినీ పండితులు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ హాలీవుడ్‌ను తలదన్నే రేంజ్‌లో కల్కిని తెరకెక్కించి.. ప్రేక్షకులకు విజువల్‌ వండర్‌ని అందించాడని ప్రశంసిస్తున్నారు. 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకోనే, శోభన వంటి దిగ్గజాలు నటించారు. విడుదలకు ముందే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో కల్కి రికార్డులు క్రియేట్‌ చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన కల్కి తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ మీద.. సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి చిత్రం.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేస్తుందనే అంచనాల మధ్య విడుదలైంది. ఇక ఫస్ట్‌ డే కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్‌ వైడ్‌గా భారీ కలెక్షన్లు వసూలు చేసి.. భారతీయ సినిమా చరిత్రలో మూడవ అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసిన చిత్రంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం.. నాగ్ అశ్విన్-ప్రభాస్‌ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా భారతదేశంలో దాదాపు రూ.95 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం అయితే ఇది దాదాపు రూ.118 కోట్లు అని సమాచారం. అలాగే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కల్కికి రూ.180 కోట్లు కలెక్షన్స్ సాధించి.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది.

కల్కికి ముందు ఈ జాబితాలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి 2 సినిమాలు ఉన్నాయి. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజే రూ.223 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ ఓపెనర్‌గా కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 ఉంది. ఈ సినిమా కూడా తొలి రోజు రూ.217 కోట్లకు పైగా వసూలు చేసింది. వీటి తర్వాత స్థానంలో ఇప్పుడు కల్కి చేరింది. ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.180 కోట్లు కలెక్షన్‌ చేసి.. మూడవ స్థానంలో నిలిచింది.

ఇక ఇప్పటివరకు భారతదేశంలో కేజీఎఫ్ 2 రూ.159 కోట్లు , సలార్ రూ.158 కోట్లు, లియో రూ.142 కోట్లు, సాహో రూ.130 కోట్లు, జవాన్ రూ.129 కోట్లు రాబట్టగా.. ఇప్పుడు కల్కి సినిమా గ్లోబల్ ఓపెనింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. టికెట్‌ ధరల పెంపు, షోల సంఖ్యను పెంచుకునేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు కల్కి టీమ్‌కు అనుమతించాయి. మరో వారం రోజుల పాటు కల్కి టికెట్‌ ధరలు భారీగానే ఉండనున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల లోపే కల్కి బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని అంటున్నారు. ఇక అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో కల్కి రికార్డులు క్రియేట్‌చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని.. ఏకంగా 20 లక్షల టికెట్లు విక్రయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి