iDreamPost
android-app
ios-app

ఆగస్టు 15న వచ్చిన 4 చిత్రాల డే1 కలెక్షన్స్‌.. పైచేయి ఎవరిదంటే?

  • Published Aug 16, 2024 | 11:04 AM Updated Updated Aug 16, 2024 | 11:09 AM

Aug 15 2024 Release Movie Day 1 Collections: ఆగస్టు 15 సందర్భంగా నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి తొలి రోజు ఏ సినిమా ఎంత కలెక్ట్‌ చేసిందంటే...

Aug 15 2024 Release Movie Day 1 Collections: ఆగస్టు 15 సందర్భంగా నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి తొలి రోజు ఏ సినిమా ఎంత కలెక్ట్‌ చేసిందంటే...

  • Published Aug 16, 2024 | 11:04 AMUpdated Aug 16, 2024 | 11:09 AM
ఆగస్టు 15న వచ్చిన 4 చిత్రాల డే1 కలెక్షన్స్‌.. పైచేయి ఎవరిదంటే?

ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగులో మొత్తంగా నాలుగు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిల్లో హరీశ్‌ శంకర్‌-రవితేజ కాంబోలో వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌, పూరి-రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాలతో పాటుగా.. ఎన్టీఆర్‌ బావ మరిది నార్నె నితిన్‌ ఆయ్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూడు తెలుగు సినిమాలతో పాటుగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ నటించిన తంగలాన్‌ కూడా ఆగస్టు 15న నాడే థియేటర్లలో విడుదలయ్యింది. ఈ నాలుగు చిత్రాల్లో మిస్టర్‌ బచ్చన్‌, డబుల్‌ ఇస్మార్ట్‌, తంగలాన్‌ మీద ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఆయ్‌ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. మరి గురువారం నాడు వచ్చిన ఈ నాలుగు చిత్రాల్లో ప్రేక్షకులు దేన్ని ఆదరించారు.. తొలి రోజు ఏ సినిమా ఎంత కలెక్ట్‌ చేసిందంటే..

మిస్టర్‌ బచ్చన్‌

రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ కథ అందరికీ తెలిసిందే. అజయ్ దేవ్ గన్ రైడ్ సినిమాకి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. టాక్‌ విషయానికి వస్తే.. సినిమా ఫస్టాఫ్‌ బాగుంది.. సెకండాఫ్‌ యావరేజ్‌ అన్నారు ప్రేక్షకులు. పైగా చాలా మంది ఈ సినిమాను హిందీలో చూసే ఉండటంతో.. పెద్దగా ఆసక్తి కనబరచలేదు. సినిమా టాక్‌ సంగతి అలా ఉంచితే..

మిస్టర్‌ బచ్చన్‌ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. అడ్వాన్స్ బుకింగ్స్, తెగిన టికెట్లు అన్నింటిని కలుపుకుంటే మిస్టర్‌ బచ్చన్‌ రూ. 3-3.5 కోట్ల వరకు షేర్‌ను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్, డే వన్ కలెక్షన్లను కలుపుకొని రూ. 4.8 నుంచి 5 కోట్ల వరకు షేర్ ను కొల్లగొట్టే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు.

డబుల్ ఇస్మార్ట్

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రామ్‌ హీరోగా.. ఇస్మార్ట్‌కు సీక్వెల్‌గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇస్మార్ట్‌లానే డబుల్‌ ఇస్మార్ట్‌ కూడా భారీ హిట్టు కొడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి. ఫస్టాప్‌ పర్లేదు.. సెకండాఫ్ని చుట్టేశారు అనే టాక్‌ వచ్చింది.

కాకపోతే రిలీజ్‌కు ముందు వరకు సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో.. డబుల్‌ ఇస్మార్ట్‌.. తొలి రోజున.. తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 7 కోట్లు, కర్ణాటక నుంచి రూ. 50 లక్షలు, హిందీ నుంచి రూ. 50 లక్షలు వసూళ్లు చేసింది. మెుత్తంగా ఇండియా వైడ్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ రూ. 9 కోట్లను కలెక్ట్ చేయగా.. వరల్డ్‌ వైడ్‌గా 15 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్ట్‌ చేశాడని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తంగలాన్

బ్రిటీష్‌ కాలంలో బంగారం వేట అనే కాన్సెప్ట్‌తో సాగే కథ తంగలాన్. చియాన్‌ విక్రమ్‌ ప్రధాన పాత్రలో, భారీ బడ్జెట్‌తో వచ్చిన తంగలాన్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయానికి వస్తే.. తంగలాన్ మూవీ తొలిరోజు వసూళ్ల విషయానికి వస్తే.. తమిళనాడులో రూ. 11 కోట్లు(15 కోట్ల గ్రాస్), తెలుగులో రూ. 1.5(3 కోట్ల గ్రాస్), మలయాళంలో రూ. 20 లక్షలు, కన్నడలో రూ. 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్‌ చేసింది. ఇండియా వైడ్‌గా చూసుకుంటే రూ. 20 కోట్ల గ్రాస్.. ఇక వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే విక్రమ్ రూ. 26 కోట్లను కలెక్ట్‌ చేసింది.

ఆయ్

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ రెండో చిత్రం ఆయ్. ఫుల్ ఆన్ కామెడీ లైన్ తో ఈ చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయానికి వస్తే.. ఆయ్‌ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా 2 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. ఈ సినిమా బడ్జెట్‌ 8 కోట్లు కాగా.. తొలి రోజే 2 కోట్ల రూపాయలు వసూలు చేయడం గమనార్హం అంటున్నారు.

ఎవరిది పైచేయంటే..

నాలుగు సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ చూసుకుంటే.. తంగలాన్‌కు తమిళ్‌లో భారీగా కలెక్షన్లు వచ్చాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. డబుల్‌ ఇస్మార్ట్‌.. వరల్డ్‌ వైడ్‌గా 15 కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. పైచేయి సాధించాడు. ప్రేక్షకులు ఈ మూవీకే పట్టం కాట్టారు. ఇక పోతే ఫస్ట్‌ డే కలెక్షన్లు వచ్చినంత.. సెకండ్‌ డే రావని అంటున్నారు. డే2 కలెక్షన్స్‌ మరింత తగ్గే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.