హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణం అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. చిన్న వయసులోనే(48) ఆయన చనిపోవడం పట్ల చాలామంది ఆశ్చర్యం వక్తం చేశారు. శ్వాసకోశ సమస్యతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే తమిళనాడులోని స్థానిక పత్రకల్లో వస్తున్న వార్తలు మరోలా ఉన్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చిన కారణంగానే విద్యాసాగర్ అనారోగ్యానికి గురైయ్యారని పేర్కొన్నాయి. మీనా ఇంటి సమీపంలో పావురాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని, వాటి […]
1992 సంవత్సరం, మెగాస్టార్ చిరంజీవికి పీక్స్ టైం. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు మూడు పోటాపోటీగా ఆడిన సూపర్ బ్లాక్ బస్టర్స్. చిరు కె విశ్వనాథ్ ఆపద్బాంధవుడు చేస్తున్న టైంలో నిర్మాతలు కెసి శేఖర్ బాబు, డి శివప్రసాద్ రెడ్డికి గతంలో ఇచ్చిన కమిట్ మెంట్ మేరకు విడివిడిగా సినిమాలు ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరిని కంబైన్డ్ గా ఓ సినిమాకు ఒప్పించారు. ఎన్నో సబ్జెక్టులు ప్రతిపాదన దశలో వచ్చినా ప్రముఖ తమిళ రచయిత […]
రీమేక్ సినిమాల విషయాలు లోతుకు వెళ్లేకొద్దీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. టాలీవుడ్ లో ఇప్పుడే కాదు ముందు నుంచి ఇతర బాషల బ్లాక్ బస్టర్ల హక్కులు కొనడం వాటిని మక్కికి మక్కి తీయడం హిట్లు ఫ్లాపులు అందుకోవడం ముందు నుంచి ఉన్నదే. కానీ కొన్ని ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. హీరోల ఇమేజ్ ని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా అక్కడ ఆడేసింది కదాని గుడ్డిగా తీస్తే అంతే సంగతులు. అదెలాగో చూద్దాం. 1991 తమిళంలో కస్తూరి రాజా […]
ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలేజ్ డ్రామాలది విశిష్ట స్థానం. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఈ బ్యాక్ డ్రాప్ లో సూపర్ హిట్లు అందుకున్నవాళ్ళు ఉన్నారు. బలమైన ఎమోషన్లకు ఆస్కారం ఉండటం, పెర్ఫార్మన్స్ చూపించుకోవడానికి అవకాశం దక్కడం లాంటివి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆ పరంపరలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సూర్యవంశం. ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళదాం. 1997 తమిళంలో విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన సూర్యవంశం ఆ ఏడాది అతి […]
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎవరికి జరగని విధంగా రెండు ఓటిటి డైరెక్ట్ రిలీజులు ఒక్క విక్టరీ వెంకటేష్ కు మాత్రమే దక్కాయి. నాని ఆల్రెడీ ఈ ఫీట్ అందుకున్నప్పటికీ అతను ఈ జనరేషన్ లో వస్తాడు కాబట్టి ఒకే గాటన కట్టలేం. ఆరేళ్ళ క్రితం వచ్చిన దృశ్యం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చిందో ఎవరూ మర్చిపోలేదు. ఇన్నేళ్ల తర్వాత దానికి కొనసాగింపు అంటే ఆసక్తి ఉండటం సహజం. అందులోనూ ఆల్రెడీ మలయాళంలో హిట్టైన సీక్వెల్ కావడంతో అభిమానులు మంచి […]
మరో టాలీవుడ్ సినిమా దృశ్యం 2 డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. పేరుకి ఎల్లుండే విడుదలైనప్పటికీ అమెజాన్ ప్రైమ్ తన సంప్రదాయాన్ని అనుసరించి రేపు రాత్రి 10 గంటల నుంచే ప్రీమియర్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నారప్ప తర్వాత వరసగా రెండో డిజిటల్ విడుదలకు సిద్ధపడిన వెంకీ మీద నిర్మాత సురేష్ బాబు మీద అభిమానులు కాసింత గుస్సాగానే ఉన్నారు. ముక్కు మొహం తెలియని చిన్న సినిమాలే ధైర్యంగా థియేటర్లకు వస్తుంటే ఇంత […]
మాములుగా మనకు సంక్రాంతి అంటే భారీ సినిమాలు, కోట్లలో కలెక్షన్లు, పెద్ద హీరోల పోటీని ఎక్కువగా చూస్తాం. ఇది ఎన్నో ఏళ్ళుగా ఒక సంప్రదాయంలా వస్తున్నదే. కానీ దానికి భిన్నంగా స్టార్ హీరోలవి డిజాస్టర్ కావడం, ఎలాంటి అంచనాలు లేని చిన్న చిత్రాలు గొప్ప విజయాలు అందుకోవడం అరుదుగా జరుగుతుంది. దానికి వేదికగా నిలిచింది 1991 సంక్రాంతి. ఆ విశేషాలు చూద్దాం. ఆ ఏడాది ముందుగా వచ్చింది చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్. యండమూరి వీరేంద్రనాథ్ […]
వెంకటేష్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదని కోరుకున్నారో ఆ దృశ్యం 2 ఓటిటి రిలీజ్ అఫీషియల్ అయిపోయింది. నారప్ప తర్వాత తక్కువ గ్యాప్ లో దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25న ప్రీమియర్ కాబోతోంది. దీన్ని థియేటర్లలో చూడాలనుకున్న దగ్గుబాటి అభిమానులకు ఇది షాక్ కలిగించింది. ఈ సినిమా ఓటిటికేనని ముందు నుంచి ప్రచారం జరిగినప్పటికీ నిర్మాత సురేష్ బాబు మనసు మార్చుకుంటారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అయితే అది జరగలేదు. కట్ చేస్తే […]
https://youtu.be/wjCY-sIBvqE
ఒకపక్క థియేటర్లు చూస్తేనేమో జనంతో కళకళలాడుతున్నాయి. మరోవైపు డైరెక్ట్ ఓటిటి రిలీజుల ప్రహసనం ఆగడం లేదు. వెంకటేష్ నారప్ప ప్రైమ్ లో వచ్చినప్పుడు ఎంత ఇష్యూ అయ్యిందో చూశాం. నాని టక్ జగదీష్ కు ఏకంగా యుద్ధాలు జరిగినంత పనైంది. ఇప్పుడు దృశ్యం 2 వంతు వచ్చేలా ఉంది. గతంలోనే దీన్ని కూడా హాట్ స్టార్ కి ఇచ్చేశారని ఆ మేరకు ఒప్పందాలు అయ్యాయని రెండు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. కానీ నిన్న ట్విట్టర్ లో […]