iDreamPost
android-app
ios-app

హీరోయిన్ ఛాన్సుల కోసం కక్కుర్తిపడి తప్పులు చేయొద్దు.. నటి మీనా కామెంట్స్!

  • Author ajaykrishna Published - 10:58 AM, Thu - 13 July 23
  • Author ajaykrishna Published - 10:58 AM, Thu - 13 July 23
హీరోయిన్ ఛాన్సుల కోసం కక్కుర్తిపడి తప్పులు చేయొద్దు.. నటి మీనా కామెంట్స్!

చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం హీరోయిన్స్, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తప్పులు చేస్తుంటారని అప్పుడప్పుడు వింటుంటాం. గతంలో అంటే అవకాశాల కోసం హీరోయిన్స్ తప్పులు చేశారని ఎక్కువగా వినేవాళ్ళం. కానీ.. రోజులు మారుతూ వచ్చాయి. అందరూ అప్డేట్ అయ్యారు.. అన్ని రంగాలలో పద్ధతులు, కట్టుబాట్లు కూడా అప్డేట్ అయ్యాయి. సో.. ఒకప్పుడు జరిగిన విధంగా ఛాన్స్ ల కోసం అమ్మాయిలు పాడుపనులు చేయడం లేదని అందరి అభిప్రాయం. నిజానిజాలు ఏంటనేది.. ఇంకా సీక్రెట్ గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? అనేది తెలియదు. బట్.. కాస్టింగ్ కౌచ్ అనేది రచ్చ మొదలయ్యాక దాదాపు ఇండస్ట్రీలో ఆ సంఘటనలు తగ్గాయి అనే చెప్పుకోవాలి.

ఈ విషయంపైన ఇప్పటిదాకా చాలామంది సీనియర్ హీరోయిన్స్ సైతం కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిలకు జాగ్రత్తలు చెబుతా వచ్చారు. తాజాగా సీనియర్ నటి మీనా యంగ్ జనరేషన్ అమ్మాయిలకు.. ఇండస్ట్రీలో ఎలా మెలగాలో సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మీనా గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. వయసులో ఉన్నప్పుడే హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించేసింది. అప్పటినుండి తల్లి క్యారెక్టర్స్ చేస్తూ వస్తోంది. గతేడాది మీనా భర్త చనిపోవడంతో పెద్దగా కెమెరా ముందుకు రాలేదు. అంతకుముందు కనీసం టీవీ ప్రోగ్రాంస్ లో అయినా కనిపించేది.

ఇదిలా ఉండగా.. మీనా గతంలోనే కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసింది. ఆ మాటలు ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మీనా మాట్లాడుతూ.. ‘నేను హీరోయిన్ గా చేసిన రోజుల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. హీరోలు.. దర్శకులు.. నిర్మాతలు ఇబ్బందులు పెడుతుండేవారు. అయితే.. అలాంటివాళ్ళు లేడీస్ తో మాట్లాడేటప్పుడు వాళ్ల ఇళ్లలో కూడా లేడీస్ ఉన్నారని గుర్తుంచుకోవాలి. హీరోయిన్స్ కూడా మారాలి. అవకాశాల కోసం తప్పుడు దారిలో వెళ్ళకూడదు. ప్రయత్నాలు చేసేటప్పుడు టైం పడుతుంది. ఓపిక కూడా ఉండాలి. టాలెంట్ ఎప్పుడు వృధా కాదు.. ఛాన్సులు వస్తాయి. కాస్టింగ్ కౌచ్ విషయంలో నేను లక్కీ. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు.’ అని మీనా చెప్పుకొచ్చింది. మరి మీనా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişpiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetcasibomgrandpashabet girişbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet