iDreamPost
android-app
ios-app

మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించిన మీనా! కారణం ఏంటంటే?

  • Published Jul 30, 2024 | 11:09 AM Updated Updated Jul 30, 2024 | 11:09 AM

Meena praised Manchu Vishnu: తాజాగా మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించింది సీనియర్ హీరోయిన్ మీనా. ఈ మేరకు ఇన్ స్టాలో విష్ణుకు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

Meena praised Manchu Vishnu: తాజాగా మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించింది సీనియర్ హీరోయిన్ మీనా. ఈ మేరకు ఇన్ స్టాలో విష్ణుకు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 30, 2024 | 11:09 AMUpdated Jul 30, 2024 | 11:09 AM
మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించిన మీనా! కారణం ఏంటంటే?

మంచు విష్ణు.. ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకొంటోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించింది సీనియర్ హీరోయిన్ మీనా. ఈ మేరకు ఇన్ స్టాలో విష్ణుకు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

హీరో, హీరోయిన్లను విమర్శిస్తూ.. అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలను 48 గంటల్లో తొలగించాలని ఆ యూట్యూబ్ ఛానల్స్ కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. అలాంటి ఛానల్స్ ను రద్దు చేయించాడు. విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంపై సీనియర్ హీరోయిన్ మీనా ధన్యవాదాలు తెలుపుతూ.. ఇన్ స్టాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. అందులో ఈ విధంగా రాసుకొచ్చింది.

“తప్పుడు కంటెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై యాక్షన్ తీసుకున్న ‘మా’, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. నటీ, నటులు నెగటీవ్ కామెంట్స్ ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని అందరం కలిసి ఎదుర్కొవాలి. ఇక మీరు ఇండస్ట్రీ సమగ్రత కోసం చూపుతున్న అంకిత భావం ఎంతో గొప్పది, అభినందనీయం. ఇలాంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు భవిష్యత్ లో ఇంకా తీసుకుంటారని అనుకుంటున్నాను. మీరు చాలా మంచి పనిచేశారు”అంటూ మీనా రాసుకొచ్చింది. కాగా.. నటీ, నటులతో పాటుగా వారి కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానల్స్ ను తొలుత, ఆ తర్వాత మరో 18 ఛానల్స్ ను ‘మా’ రద్దు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Meena Sagar (@meenasagar16)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom