iDreamPost
android-app
ios-app

మీనాను పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తా! ఇదేమి పిచ్చి కామెంట్స్ రా బాబు?

  • Published Mar 25, 2024 | 3:26 PM Updated Updated Mar 25, 2024 | 3:26 PM

నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మలయాళ, తమిళ, తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. 2022లో భర్త విద్యా సాగర్ ను కోల్పోయిన ఈ నటి.. ఇప్పుడు పాపతో ఒంటరి జీవితాన్ని సాగిస్తోంది. కాగా,..

నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మలయాళ, తమిళ, తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. 2022లో భర్త విద్యా సాగర్ ను కోల్పోయిన ఈ నటి.. ఇప్పుడు పాపతో ఒంటరి జీవితాన్ని సాగిస్తోంది. కాగా,..

  • Published Mar 25, 2024 | 3:26 PMUpdated Mar 25, 2024 | 3:26 PM
మీనాను పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తా! ఇదేమి పిచ్చి కామెంట్స్ రా బాబు?

దక్షిణాది ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి మీనా. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసి.. తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ ఇప్పటికీ హీరోయిన్‌గానే నటిస్తోంది. 2009లో విద్యా సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నైనిక అనే పాప ఉంది. కాగా, 2022లో భర్తను కోల్పోయింది మీనా. ఆ విషాదం, వేదన నుండి కోలుకున్న ఆమె సినిమాల్లో బిజీ అయిపోయింది. అయితే ఈ సమయంలో ఆమెపై పలు రూమార్స్ వచ్చాయి. నటుడు, రజనీకాంత్ మాజీ అల్లుడు.. ధనుష్‌తో ఎఫైర్ అని, అతడిని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ మీడియా కోడై కూసింది. ఈ గాసిప్స్ పై స్పందించిన మీనా.. వాస్తవాలు తెలుసుకుని రాయండని ఫైర్ అయ్యింది

కాగా, కూతురితో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతుంది ఈ స్టార్ హీరోయిన్. అయితే ఇప్పుడు ఆమెకు ఓలైఫ్ ఇస్తానంటూ ముందుకు వచ్చాడు సినీ క్రిటిక్ సంతోష్ వర్కి. తరచూ హీరోయిన్లపై విమర్శలు చేస్తూ.. వారితో చీవాట్లు.. తిట్లు తింటూ ఉంటాడు సంతోష్. ఇప్పుడు నటి మీనాకు వివాహం చేసుకోవడానికి సిద్దంగా ఉన్నానని నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆమెకు కుమార్తె ఉన్న తనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదూ అంటూ మాట్లాడాడు. మంజు వారియర్‌లా మీనా మంచి అమ్మాయని.. ఆమెను రెండో పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ఇస్తానంటూ పిచ్చి కామెంట్స్ చేస్తున్నాడు.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంతోష్ వర్కికి కొత్తేమీ కాదు. గతంలో ప్రముఖ నటి నిత్యా మీనన్‌ను పెళ్లి చేసుకుంటా అంటూ హింసించాడు. నిత్యా మీనన్ ఫైర్ అయ్యే సరికి క్షమాపణలు చెప్పాడు. దీని తర్వాత కూడా ఎవరో ఒక హీరోయిన్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలు అవుతూనే ఉన్నాడు. తనకు నటి నిఖిలా విమల్ అంటే ఇష్టమని, తనను పెళ్లి చేసుకుంటానని వాగాడు. వీరిద్దరే కాదు.. ఇతడి పెళ్లి ప్రపోజల్స్‌లో చాలా మందే ఉన్నారు.  ఐశ్వర్య లక్ష్మి, మంజు వారియర్, కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ పేర్లను కూడా తీసుకు వచ్చాడు. ఇప్పుడు మీనాను పెళ్లి చేసుకుంటా అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నాడు. కాగా, ఇదంతా అతడి పబ్లిసిటీ కోసం చేస్తున్న చర్యగా చెబుతున్నారు కొందరు. ఇతడు ఫేమ్ అయ్యేందుకు హీరోయిన్లను వివాహం చేసుకుంటానంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడని తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet