iDreamPost
android-app
ios-app

Moratodu Naa Mogudu : అక్కడి బ్లాక్ బస్టర్ ఇక్కడి డిజాస్టర్

  • Published Jan 08, 2022 | 12:29 PM Updated Updated Dec 08, 2023 | 5:50 PM

అప్పటిదాకా కోలీవుడ్ లో స్థిరపడేందుకు గట్టిగా కష్టపడుతున్న హీరోయిన్ మీనాకు ఊహించిన దానికన్నా పెద్ద బ్రేక్ దొరికింది. కమెడియన్ వడివేలుకి ఇది మొదటి చిత్రం. ఇళయరాజా పాటలు ఈ మూవీని ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి

అప్పటిదాకా కోలీవుడ్ లో స్థిరపడేందుకు గట్టిగా కష్టపడుతున్న హీరోయిన్ మీనాకు ఊహించిన దానికన్నా పెద్ద బ్రేక్ దొరికింది. కమెడియన్ వడివేలుకి ఇది మొదటి చిత్రం. ఇళయరాజా పాటలు ఈ మూవీని ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి

Moratodu Naa Mogudu : అక్కడి బ్లాక్ బస్టర్ ఇక్కడి డిజాస్టర్

రీమేక్ సినిమాల విషయాలు లోతుకు వెళ్లేకొద్దీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. టాలీవుడ్ లో ఇప్పుడే కాదు ముందు నుంచి ఇతర బాషల బ్లాక్ బస్టర్ల హక్కులు కొనడం వాటిని మక్కికి మక్కి తీయడం హిట్లు ఫ్లాపులు అందుకోవడం ముందు నుంచి ఉన్నదే. కానీ కొన్ని ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. హీరోల ఇమేజ్ ని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా అక్కడ ఆడేసింది కదాని గుడ్డిగా తీస్తే అంతే సంగతులు. అదెలాగో చూద్దాం. 1991 తమిళంలో కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్ రాసావిన్ మనసిలే’ భారీ విజయాన్ని అందుకుంది. సుద్ద మొరటుగా కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజ్ కిరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా బిసి సెంటర్స్ లో రికార్డులు అందుకుంది.

అప్పటిదాకా కోలీవుడ్ లో స్థిరపడేందుకు గట్టిగా కష్టపడుతున్న హీరోయిన్ మీనాకు ఊహించిన దానికన్నా పెద్ద బ్రేక్ దొరికింది. కమెడియన్ వడివేలుకి ఇది మొదటి చిత్రం. ఇళయరాజా పాటలు ఈ మూవీని ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. వెరసి ఎవరూ ఊహించని విధంగా సిల్వర్ జూబ్లీ అందుకుంది. ఇది డైరెక్టర్ డెబ్యూ చిత్రం. మాలింగపురం ఆయన స్వంత ఊరిలో జరిగిన సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించారు. కట్ చేస్తే దీని తెలుగు హక్కులకు గట్టి డిమాండ్ ఏర్పడింది. మంచి ఫ్యాన్సీ రేట్ కి నిర్మాత బుల్లిసుబ్బారావు కొనేశారు. మగాడు షూటింగ్ లో గాయపడి ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిన రాజశేఖర్ కు ఈ కథ బాగా నచ్చేసింది. ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారు. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ ని సిద్ధం చేయగా విజయ్ కుమార్ ఛాయాగ్రహణం నిర్వహించారు.

ఒరిజినల్ వెర్షన్ లో చేసిన మీనా తన పాత్రను మళ్ళీ పోషించేందుకు సిద్ధమయ్యింది. ఇళయరాజా స్వరాలను యధాతథంగా తీసుకున్నారు. బామ్మా పాత్రకు భానుమతి గారు ఒప్పుకోవడం చాలా ప్లస్ అయ్యింది. మంగమ్మ గారి మనవడు తర్వాత ఆవిడ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. రీమేకులు ఎక్కువగా అలవాటు లేని ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వ బాధ్యతలకు సరే అన్నారు.అయితే మీనా పాత్ర చనిపోవడం, రాజశేఖర్ బిడ్డకు తండ్రిగా నటించడం, సెంటిమెంట్ లో మరీ అరవ వాసనై ఎక్కువైపోవడం లాంటి కారణాల వల్ల 1992 మార్చి 5న విడుదలైన మొరటోడు నా మొగుడు ఫ్లాప్ అయ్యింది. అంకుశం లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూసిన అభిమానులు రాజశేఖర్ ని తాగుబోతుగా, మొండోడిగా చూడలేకపోయారు. అక్కడి క్లాసిక్ ఇక్కడి డిజాస్టర్ అయ్యింది

Also Read : Kirathakudu : కిల్ చేసిన కిరాతకుడు – Nostalgia