iDreamPost
android-app
ios-app

Meena: ధనుష్‌తో రెండో పెళ్లి.. మీనా ఏమన్నారంటే.?

నటీనటుల మధ్య ఎఫైర్ ఉన్నాయంటూ వార్తలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. ఎక్కువ సినిమాలు వారితో కలిసి చేసినా, బయట కనిపించినా, లేదంటే కారణాలు లేకుండానే.. వారి మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. తాజాగా మీనా కూడా వాటిపై స్పందించింది.

నటీనటుల మధ్య ఎఫైర్ ఉన్నాయంటూ వార్తలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. ఎక్కువ సినిమాలు వారితో కలిసి చేసినా, బయట కనిపించినా, లేదంటే కారణాలు లేకుండానే.. వారి మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. తాజాగా మీనా కూడా వాటిపై స్పందించింది.

Meena: ధనుష్‌తో రెండో పెళ్లి.. మీనా ఏమన్నారంటే.?

సినిమా ప్రపంచంలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ వార్తలు వస్తుంటూనే ఉంటాయి. ఇద్దరూ కలిసి ఒకటి, రెండు సినిమాల్లో నటించిన వెంటనే ఆ హీరో హీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుందంటూ, తర్వలో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చేస్తాయి. ఏదైనా ఫంక్షన్లలో కాస్త క్లోజ్‌గా ఉన్నా, వారి పుట్టిన రోజులకు వీరు విష్ చేసినా, ఎక్కడైనా బయట కనిపించినా.. తంటే.. పుకార్లు పుట్టించేస్తుంటారు. అయితే కొంత మంది నటీనటులు స్పందిస్తుంటారు. మరికొంత మంది అస్సలు పట్టించుకోరు. కొన్నిసార్లు ఇదే వార్తల కారణంగా సఫర్ అయ్యి.. ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లు సెలబ్రిటీలు ఉన్నారు. ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి.. ఆ రూమర్లకు చెక్ పెట్టేస్తున్నారు కొంత మంది యాక్టర్స్.

తనపై వచ్చిన ఇటువంటి రూమర్లపై క్లారిటీ ఇచ్చింది మీనా. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న భర్త సాగర్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. గత ఏడాది అనారోగ్య సమస్యలతో సాగర్ మరణించిన సంగతి విదితమే. అయితే గతంలో సోషల్ మీడియాలో తనకు, తన భర్త మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు పుట్టుకొచ్చాయని అన్నారు. భర్త చనిపోవడంపై స్పందించిన మీనా.. ‘ భర్త చనిపోతాడని ఊహించలేదు. లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేయడం ఆలస్యం కావడంతో సాగర్ మృతి చెందాడు. మెడికల్ పరంగా ఇబ్బందులు పడ్డాను. ఇన్ని విషయాలు ఉన్నాయా అని తెలిసింది. లేట్ అయ్యే సరికి..చికిత్సకు ఆయన బాడీ సహకరించలేదు. లంగ్స్ దొరికేసరికి ఆయన మృతి చెందారు’ అని తెలిపారు. ఆయన లంగ్స్ కోసం ఎన్నో ప్రాంతాల్లో వెతికామని అన్నారు.

Meena clarity on the second marriage

సాగర్ లేడనుకుని..అప్పుడప్పుడే కోలుకుంటున్న సమయంలో ఓ రూమర్ హల్ చల్ చేసిందన్నారు. తనకు ధనుష్ తో రెండో పెళ్లి అన్నట్లు పుకార్లు పుట్టించారు. ‘ ధనుష్.. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఒంటరిగా ఉండటంతో.. అతడితో పెళ్లి జరుగుతుందని రూమర్స్ చేశారు. చాలా కోపం వచ్చింది. లేనిపోని ఎందుకు పుట్టిస్తారు. ఒక్క మాట అడగొచ్చు కదా.. లేదు నేను చెబుతా కదా. మా కుటుంబం కూడా సఫర్ అయ్యింది. మా అత్తయ్య కూడా బాధపడింది. సెన్సేషనల్ కోసం ఏదో ఒకటి రాసేస్తున్నారు. ఆయన చనిపోవడంతో వెంటనే ఈ రూమర్ వచ్చింది. నిజం ఉంటేనే రాయండి..ఏదో ఎవరో చెప్పారని రాసేస్తున్నాను. ఎందుకు మహిళల్నే టార్గెట్ చేస్తుంటారు’ అని ప్రశ్నించింది. ప్రస్తుతం తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అన్నారు. రేపే ఏమౌతుందో చెప్పలేనన్నారు. చిన్నప్పుడు అలరించిన మీనా.. టాప్ హీరోయిన్ గా మారి.. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet