iDreamPost
android-app
ios-app

ఈ స్కూల్ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది..? ఎవరో చెప్పగలరా..?

  • Published Sep 05, 2024 | 4:35 PM Updated Updated Sep 05, 2024 | 4:35 PM

ఈ స్కూల్ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది..? ఎవరో చెప్పగలరా..? టీచర్స్ డే సందర్భంగా ఈ పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఒక్క తెలుగే కాదు సౌత్ ఇండియాలో టాప్ రేంజ్ ఆమెది. ఎవరో చెప్పుకోండి.

ఈ స్కూల్ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది..? ఎవరో చెప్పగలరా..? టీచర్స్ డే సందర్భంగా ఈ పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఒక్క తెలుగే కాదు సౌత్ ఇండియాలో టాప్ రేంజ్ ఆమెది. ఎవరో చెప్పుకోండి.

  • Published Sep 05, 2024 | 4:35 PMUpdated Sep 05, 2024 | 4:35 PM
ఈ స్కూల్ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది..? ఎవరో చెప్పగలరా..?

ఈ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది గుర్తు పట్టారా..? ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా ఈ పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టీచర్ గొప్పతనం గురించి చెబుతూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఆమె చైల్ట్ ఆర్టిస్టు నుండే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం. 90వ దశకంలో ఇండస్ట్రీని షేక్ చేసి.. టాప్ హీరోయిన్ అయ్యింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జగపతి బాబు, శ్రీకాంత్, మోహన్ బాబు, రవితేజ వంటి స్టార్ చిత్రాల్లో నటించింది. ఆమె మరెవ్వరో కాదు చిలిపి కళ్లతో, చిరు నవ్వులతో మనసు దోచేసిన మీనా. ఈ ఫోటోలో ఆమె ఎక్కడ ఉందంటే.. పై లైనులో లెఫ్ట్ నుండి రెండో పిల్లనే మన మీనా. తమిళనాడులో (తల్లి కేరళ , తండ్రి ఆంధ్ర) పుట్టి పెరిగిన మీనా.. ఆరేళ్ల ప్రాయం నుండే సినిమాల్లో నటించింది.

శివాజీ గణేశన్ హీరోగా వచ్చిన నెన్జంగల్ చిత్రంతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‌గా మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో మెరిసింది ఈ బ్యూటీ. చాలా మందికి మీనా నటిగానే తెలుసు.. కానీ ఆమె భరత నాట్యం డ్యాన్సర్ కూడా. అంతే కాదు ప్లే బ్యాక్ సింగర్ కూడా. పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో పాడింది. నవయుగం మూవీతో హీరోయిన్ అయిన ఈ సుందరి.. సీతారామ్యగారి మనవరాలు చిత్రంతో మంచి మార్కులు వేయించుకుంది. వరుస హిట్లతో టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లిపోయింది. తెలుగులో ఆమె అత్యధికంగా వర్క్ చేసింది టాప్ హీరో వెంకటేష్‌తో. ఈ ఇద్దరిది బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్. ఈ ఇద్దరు నటించిన అన్ని చిత్రాలు హిట్ కొట్టడం మరో విశేషం.

Meena Heroine

చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్య వంశం, దృశ్యం, దృశ్యం 2లో కలిసి నటించారు. చిరంజీవితో ముఠామేస్త్రీ, స్నేహం కోసం, బాలకృష్ణ అశ్వమేథం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, కృష్ణబాబు, నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు చిత్రాల్లో నటించారు. అటు తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి స్టార్లతో ఆడిపాడింది. హిందీ, కన్నడలో అడపాదడపా చిత్రాలు చేసింది. ప్రస్తుతం రౌడీ బేబీ అనే మూవీలో నటిస్తుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యా సాగర్‌ను వివాహం చేసుకుంది. వీరికో పాప నైనిక. ఆమె కూడా చైల్ట్ ఆర్టిస్టుగా ఆకట్టుకుంది. 2022లో అనారోగ్య సమస్యలతో మీనా భర్త విద్యా సాగర్ మరణించారు. ప్రస్తుతం పాపతో ఒంటరి లైఫ్ లీడ్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Meena Sagar (@meenasagar16)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom