సాధారణంగా క్రికెట్ లో ఫిక్సింగ్ కు పాల్పడితే సదరు ఆటగాళ్లపై నిషేధం విధిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ సినిమా ఇండస్ట్రీలో నటీ, నటులపై నిషేధం విధించడం చాలా అరుదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదనే చెప్పాలి. కానీ తాజాగా ఓ యంగ్ హీరోయిన్ పై 3 ఏళ్ల పాటు నిషేధం విధించిన వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి 3 సంవత్సరాలు నిషేధం విధించేంత తప్పు ఆ హీరోయిన్ ఏం చేసిందో […]
దేశం తరపున ఎందరో క్రీడాకారులు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అంతేకాక పతకాలు గెల్చి.. దేశ పేరు ప్రతిష్టలు పెంచుతారు. ఇలా ఇప్పటికే ఎందరో క్రీడాకారులు దేశాన్ని పతకాలను తెచ్చిపెట్టారు. అయితే ఇలా విజేతలుగా దేశానికి తిరిగి వచ్చిన వారిలో కొందరికి చేదు అనుభవాలు ఎదురువుతుంటాయి. అలాంటి పరిస్థితి మణిపూర్ కు చెందిన క్రీడాకారులకు ఎదురైంది. జాతుల మధ్య వైరంతో కొన్నినెలల పాటు భగ్గుమన్న మణిపుర్లో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సమసిపోలేదు. నిరసనల వల్ల ఎంతో మంది […]
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్బీఐలో లోన్లు తీసుకున్న వారిలో చాలా మందికి ఇది భారీ ఊరట కలిగించే ప్రకటన అని చెప్పవచ్చు. ఇంతకు ఏంటా శుభవార్త అంటే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా లోన్ మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. […]
గత మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. కుకీ, మైతి తెగల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా హింసాకాండలు చెలరేగాయి. ఈ దాడుల్లో మహిళలు బలిపశువులుగా మారుతున్నారు. ఎందరో మహిళలను తమ మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశం మెుత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక మణిపూర్ లో జరిగిన ఒక్కొక్క దారుణాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో అమానుష […]
రాహుల్ గాంధీ ఇటీవలే ‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది లోక్ సభలో తిరగి అడుగుపెట్టారు. అయితే అడుగుపెట్టి ఎంతోకాలం కాలేదు. మళ్లీ మరో వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం సభలో జరిగిన అవిశ్వాసం తీర్మానంలో రాహుల్ గాంధీ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. కానీ, చివర్లో ఒక వివాదంలో చిక్కుకున్నారు. సభ నుంచి వెళ్లబోతూ మహిళా ఎంపీలవైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా […]
బుధవారం లోక్ సభలో తీవ్ర దుమారం రేగింది. అవిశ్వాస తీర్మానంలో జరుగుతున్న చర్చలో అధికార బీజేపీ, ప్రధానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని పరోక్షంగా లంకాశురుడితో పోలుస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. వాటిని అధికార పక్షం నేతలు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై […]
గత కొన్ని నెలలుగా మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా ఎందరో మాన, ప్రాణాలు కోల్పోతున్నారు. ఊర్లకు ఊర్లను తగలబెడుతున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా తయ్యారు అయ్యింది. ఇలాంటి సమయంలో కేరళ రాష్ట్రం మణిపూర్ విద్యార్థులకు అండగా నిలిచింది. కేరళ రాష్ట్రానికి చెందిన కన్నూర్ యూనివర్సిటీ మణిపూర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ప్రవేశాలను కల్పించేందుకు ముందుకువచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవాలనుకునే విద్యార్థులు […]
గత కొన్ని నెలలుగా మణిపూర్ లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఎన్ని బలగాలు మోహరించినా.. కేంద్రం చర్యలు తీసుకుంటున్నా అల్లర్లు మాత్రం ఆగడం లేదు. రెండు తెగల మధ్య జరుగుతున్న ఈ అల్లర్లలో ఎందరో అమాయకులు బలవుతున్నారు. కొన్ని రోజుల క్రితం మహిళలను నగ్నంగా ఊరేంగించిన సంఘటన దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సంఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. ఈ దారుణం మరువక ముందే మణిపూర్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. […]
మణిపూర్ లో పరిస్థితులు ఎంతగా దిగజారాయో అందరికీ తెలిసిందే. ఆ అల్లర్లు తర్వాత చాలా మంది శరణార్థులుగా వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. సొంత ఊరు, పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ సరిహద్దులు దాటేస్తున్నారు. వారిలో కొందరు కర్ణాటకకు శరణార్థులుగా చేరుకున్నారు. వారికి కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ భరోసానిచ్చారు. మణిపూర్ శరణార్థుల్లో 29 మంది చదువుకునే అమ్మాయల బాధ్యత ఆయన తీసుకున్నారు. మణిపూర్ అల్లర్ల కారణంగా చాలా మంది […]
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అంశాల్లో మణిపూర్ ఒకటి. ఈ ఈశాన్య రాష్ట్రంలో గత మూడు నెలలుగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అందులో ఒక స్త్రీపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన అందర్నీ షాక్కు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. దీనికి కారణమైన వారిని శిక్షించాలంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ డిమాండ్ […]