Swetha
మహా గ్రంధాలను రెఫెరెన్స్ గా తీసుకుని కొన్ని దశాబ్దాల క్రితమే తెరపై ఈ కథను చూపించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే ఈ తరం వారికి అదే కథను ఇంకా ఎదో కొత్తగా చూపించాలని తాపత్రయ పడుతున్నారు ఇప్పటికి దర్శకులు. ఈ క్రమంలోనే దర్శకుడు నితేశ్ తివారి రామాయణ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు.
మహా గ్రంధాలను రెఫెరెన్స్ గా తీసుకుని కొన్ని దశాబ్దాల క్రితమే తెరపై ఈ కథను చూపించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే ఈ తరం వారికి అదే కథను ఇంకా ఎదో కొత్తగా చూపించాలని తాపత్రయ పడుతున్నారు ఇప్పటికి దర్శకులు. ఈ క్రమంలోనే దర్శకుడు నితేశ్ తివారి రామాయణ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు.
Swetha
రామాయణం , మహాభారత గాధలు కొన్ని శతాబ్దాలుగా అందరికి తెలిసిన కథలే. పైగా ఈ మహా గ్రంధాలను రెఫెరెన్స్ గా తీసుకుని కొన్ని దశాబ్దాల క్రితమే తెరపై ఈ కథను చూపించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే ఈ తరం వారికి అదే కథను ఇంకా ఎదో కొత్తగా చూపించాలని తాపత్రయ పడుతున్నారు ఇప్పటికి దర్శకులు. ఈ క్రమంలోనే దర్శకుడు నితేశ్ తివారి రామాయణ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ చూస్తే నోటి మీద వేలు వేసుకోకుండా ఎవరు ఉండలేరు. అలాంటి విజువల్ గ్రాండియర్ ను రెడీ చేస్తున్నాడు దర్శకుడు.
కేవలం ఇంట్రడక్షన్ వీడియోనే మూడు నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు మేకర్స్. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , ఆ విజువల్స్ అందరిని ఇంప్రెస్ చేశాయని చెప్పి తీరాల్సిందే. ఇక గ్లిమ్ప్స్ లాస్ట్ లో అలా చూపించి చూపించినట్టుగా రణ్ బీర్ ను చూపిస్తారు. ఆ ఒక్క షాట్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అది ఎంతవరకు కొనసాగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. దీని నుంచి టీజర్ వస్తే కానీ ఓ అంచనాకు రాలేము. ప్రపంచంలోనే అత్యుత్తమ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమాను పని చేస్తున్నాయట. ఆ కష్టం అంతా గ్లిమ్ప్స్ లో కనిపిస్తూనే ఉంది. ఓం రౌత్ ఆదిపురుష్ తీసినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడో తెలియనిది కాదు. అందుకే ఈసారి నితీష్ తివారి రామాయణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
నిజానికి ఇలాంటి ఇతిహాస కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ముందు.. దాని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. పైగా అందరికి తెలిసిన కథ కాబట్టి వారికి సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అంటే కచ్చితంగా స్క్రీన్ మీద మ్యాజిక్ చేయాల్సిందే. కానీ అది లాజిక్ మిస్ అవ్వకుండా చేయాలి. సో నితీష్ తివారి ఎంతవరకు దీనిలో సక్సెస్ అవుతాడో చూడాలి. 2026 దీపావళికి మొదటి పార్ట్ వస్తుంది. 2027 దీపావళికి రెండో పార్ట్ రానుందని చెప్పేశారు. సీతాపహరణంతో పార్ట్ 1 ముగించి.. సీత అశోకవనంకు వెళ్లిన దగ్గరనుంచి రాముడు రావణుడిని అంతం చేసేవరకు పార్ట్ 2 లో ఉండబోతుందని ముంబై మీడియా టాక్. సీతగా చేస్తున్న సాయి పల్లవి ఇంట్రోను సెపరేట్ గా లాంచ్ చేయనున్నారట. సంవత్సరం ముందు నుంచే సినిమాను జనాల్లోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.