Arjun Suravaram
మణిపూర్ రావణ కాష్టంలా మారింది. ఇక్కడ కొన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దాడులు, ప్రతి దాడులతో మణిపూర్ రాష్ట్రం మండుతుంది. ఇప్పటికే అనేక దాడులు జరగ్గా..తాజాగా ఏకంగా సీఎం కాన్వాయ్ పై దాడి జరిగింది.
మణిపూర్ రావణ కాష్టంలా మారింది. ఇక్కడ కొన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దాడులు, ప్రతి దాడులతో మణిపూర్ రాష్ట్రం మండుతుంది. ఇప్పటికే అనేక దాడులు జరగ్గా..తాజాగా ఏకంగా సీఎం కాన్వాయ్ పై దాడి జరిగింది.
Arjun Suravaram
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రదాడులు, ఇతర మిలిటెంట్ల దాడులు అనేవి జరుగుతుంటాయి. ఆదివారం జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడిన సంగతి తెలిసింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిపై కాల్పులు జరపడంతో ఆ బస్సు లోయలో పడిపోయి..10 మంది చనిపోయారు. ఇది ఇలా ఉంటే.. సోమవారం ఏకంగా మణిపూర్ ముఖ్యమంత్రి కాన్వాయ్ పై దాడి జరిగింది. అనుమానిత మిలిటెంట్లు సీఎం కాన్వాయ్ పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు.
సోమవారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్ పై గుర్తు తెలియని మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు సమాచారం. మణిపూర్ లోని కాంగ్ పోక్సి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిరాబామ్ అనే ప్రాంతంలో సీఎం బీరెన్ సింగ్ మంగళవారం పర్యటంచనున్నారు. ఈ క్రమంలోనే సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి సీఎం భద్రతా సిబ్బంది వచ్చారు. ఈ నేపథ్యంలోనే మిలిటెంట్లు సీఎం కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు కాల్పులు జరిపారు. అయితే వారి దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ దాడి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో సీఎం లేనట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక జిరాబామ్ ప్రాంతంలో సీఎం బీరెన్ సింగ్ పర్యటించడానికి బలమైన కారణం ఒకటి ఉంది. ఇటీవలే మూడు రోజుల క్రితం జిరాబామ్ ప్రాంతంలో మిలిటెంట్లు 70కి పైగా ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా రావణకాష్టంగా మారిపోయింది. వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం నుంచి ప్రాణ భయంతో పారిపోయారు. మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు ఈ 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. జూన్ 6వ తేదీన గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి..అడవుల్లోకి తీసుకెళ్లి చంపేశారు. దీంతో గత కొద్ది రోజులుగా జిరాబామ్ ప్రాంతంలో అశాంతి నెలకొంది. దీంతో అల్లర్లు చెలరేగుతున్న జిరిబామ్‌ను సందర్శించాలని సీఎం అనుకున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం బీరేన్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో సాయంత్రానికి ఇంఫాల్‌కు చేరుకోవాల్సిఉన్నది.
#WATCH | Violence in Jiribam, Manipur | Imphal: #Manipur CM N Biren Singh says, “It is very unfortunate and highly condemnable. It is an attack directly on the Chief Minister, means directly on the people of the state. So, State Government has to do something. So, I will take a… pic.twitter.com/cYIqwiU1VO
— Argus News (@ArgusNews_in) June 10, 2024