iDreamPost
android-app
ios-app

జూలై లో రీరీలీజ్ ల తాకిడి.. ఒకేసారి అన్ని సినిమాలా

  • Published Jul 08, 2025 | 12:14 PM Updated Updated Jul 08, 2025 | 12:42 PM

ReRelease Movies: రీరిలీజ్ ల ట్రెండ్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో తెలియనిది కాదు. పైగా రీరిలీజ్ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలతో పోటీ పడడం.. ఫ్యాన్స్ వాటిని సెలెబ్రేట్ చేయడంతో. నిర్మాతలు కూడా రిస్క్ లు తీసుకుంటున్నారు. ఖలేజ , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల వరకు పరవాలేదు కానీ ఆ తర్వాత వచ్చిన హనుమాన్ జంక్షన్ , లక్ష్మి నరసింహ , ఆదిత్య 369 సినిమాలకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు

ReRelease Movies: రీరిలీజ్ ల ట్రెండ్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో తెలియనిది కాదు. పైగా రీరిలీజ్ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలతో పోటీ పడడం.. ఫ్యాన్స్ వాటిని సెలెబ్రేట్ చేయడంతో. నిర్మాతలు కూడా రిస్క్ లు తీసుకుంటున్నారు. ఖలేజ , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల వరకు పరవాలేదు కానీ ఆ తర్వాత వచ్చిన హనుమాన్ జంక్షన్ , లక్ష్మి నరసింహ , ఆదిత్య 369 సినిమాలకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు

  • Published Jul 08, 2025 | 12:14 PMUpdated Jul 08, 2025 | 12:42 PM
జూలై లో రీరీలీజ్ ల తాకిడి.. ఒకేసారి అన్ని సినిమాలా

రీరిలీజ్ ల ట్రెండ్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో తెలియనిది కాదు. పైగా రీరిలీజ్ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలతో పోటీ పడడం.. ఫ్యాన్స్ వాటిని సెలెబ్రేట్ చేయడంతో. నిర్మాతలు కూడా రిస్క్ లు తీసుకుంటున్నారు. ఖలేజ , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల వరకు పరవాలేదు కానీ ఆ తర్వాత వచ్చిన హనుమాన్ జంక్షన్ , లక్ష్మి నరసింహ , ఆదిత్య 369 సినిమాలకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అవేమైనా చిన్న హీరోల సినిమాల అంటే కానే కాదు. మరి కారణం ఏంటి అంటే ఎవరికీ తెలీదు. ఇదిలా ఉంటే జూలై లో ఈ రీరీలీజ్ ల తాకిడి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ నెలలో ఘాటీ , తమ్ముడు , హరి హర వీరమల్లు లాంటి సాలిడ్ సినిమాలు ఉండనే ఉన్నాయి. అయినా సరే నిర్మాతలు రీరిలీజ్ ల మ్యాటర్ లో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. జూలై 4 న యూత్ ని టార్గెట్ చేస్తూ హుషారు సినిమా రీరీలీజ్ అయింది. ఇక ఆ తర్వాత క్రికెట్ లవర్స్ ను టార్గెట్ చేస్తూ జులై 4 న ఎంఎస్ ధోని బరిలోకి కానీ అంతగా సౌండ్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు . అలాగే సుకుమార్ రచించిన ఓ కల్ట్ క్లాసిక్ మూవీ కుమారి 21F జులై 10న రానుంది. యూత్ చాలా మంది ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని కట్టిపడేస్తుంది. హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు అంతా మార్కెట్ లేదు కానీ కంటెంట్ ని నమ్ముకుని ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.

ఇక జులై 11 న మాస్ మహారాజ్ మిరపకాయ్ తో వస్తున్నాడు. అప్పట్లో ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది. సో ఇప్పుడు అదే రిపీట్ అవుతుందేమో చూడాలి. ఆ తర్వాత జులై 18న సూర్య గజినీ సినిమా వస్తుంది. ఇప్పటి జెనెరేషన్ వారు ఈ సినిమాకు హైప్ ఇస్తే కలెక్షన్స్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు అందరి ఆల్ టైం ఫెవరెట్ సమంత నాగ చైతన్య ‘ఏ మాయ చేసావే’. ఇదైతే రీరీలీజ్ లలో బాగా హిట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక అదే రోజు సూర్య ఇంకొక్కెడే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అసలు నిర్మాతలు ఎలా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా అని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒకే నెలలో మూడు సాలిడ్ స్ట్రెయిట్ రిలీజ్ ఉండగా. ఏకంగా 7 రీరీలీజ్ లను తీసుకుని వస్తున్నారు. ఇక ప్రేక్షకుల ఛాయస్ ఏ మూవీస్ అవుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.