Swetha
పుష్ప2 తో అల్లు అర్జున్ స్టార్ ఏ మారిపోయింది. దీనితో నెక్స్ట్ అల్లు అర్జున్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాడా అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆ హీరో నుంచి తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఎదురుచూస్తూనే ఉంటారు.
పుష్ప2 తో అల్లు అర్జున్ స్టార్ ఏ మారిపోయింది. దీనితో నెక్స్ట్ అల్లు అర్జున్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాడా అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆ హీరో నుంచి తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఎదురుచూస్తూనే ఉంటారు.
Swetha
పుష్ప2 తో అల్లు అర్జున్ స్టార్ ఏ మారిపోయింది. దీనితో నెక్స్ట్ అల్లు అర్జున్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాడా అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆ హీరో నుంచి తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఎదురుచూస్తూనే ఉంటారు. హీరోలు కూడా ఈ అంచనాలను నిలబెట్టుకోవడానికి సాయ శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ అట్లీ తో ఓ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా అని చెప్పారు. కానీ అది కాస్త తారక్ చేతిలోకి వెళ్ళిపోయింది. దీనితో బన్నీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎవరితో అనే ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. గతంలో ఓసారి సందీప్ రెడ్డి వంగతో ఓ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు కానీ అది కూడా డౌట్ ఏ అని అంటున్నారు.
అయితే రీసెంట్ గా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి స్వయంగా దిల్ రాజు నోటి నుంచే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దిల్ రాజు రీసెంట్ గా తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ క్రమంలో బన్నీతో రావణం అనే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశం ఉంది అన్నట్లుగా డైరెక్ట్ గా కాకపోయినా.. కాస్త హింట్ అయితే ఇచ్చేశారు. అది కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఈ సినిమా తీయబోతున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ మీదకు రాకపోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను కంప్లీట్ చేయాల్సి ఉంది. దీనికి ఎంత లేదన్న సంవత్సరం పైగానే పడుతుంది. సో అటు ఇటుగా 2027 లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.
ఇక రావణం ఏ జానర్ ఏంటి అనే సంగతులైతే తెలియదు కానీ.. మైథలాజికల్ టచ్ అయితే ఉంటుందని అంటున్నారు. దిల్ రాజు వరుస సినిమాలతో స్పీడ్ పెంచబోతున్నాడు. విజయ్ దేవర కొండ రౌడీ జనార్దన్ మొదలుకుని ఇకపై వచ్చేవి తన నుంచి భారీ చిత్రాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఆల్రెడీ చెప్పారు దిల్ రాజు. సో ఈ ప్రాజెక్ట్స్ ఎంతవరకు పట్టాలెక్కుతాయో అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.