iDreamPost
android-app
ios-app

దేశానికి కప్పు తెచ్చిన వారికి.. సహాయక శిబిరాలే దిక్కై..!

దేశానికి కప్పు తెచ్చిన వారికి.. సహాయక శిబిరాలే దిక్కై..!

దేశం తరపున ఎందరో క్రీడాకారులు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అంతేకాక పతకాలు గెల్చి.. దేశ పేరు ప్రతిష్టలు పెంచుతారు. ఇలా ఇప్పటికే ఎందరో క్రీడాకారులు దేశాన్ని పతకాలను తెచ్చిపెట్టారు. అయితే ఇలా విజేతలుగా దేశానికి తిరిగి వచ్చిన వారిలో కొందరికి  చేదు అనుభవాలు ఎదురువుతుంటాయి. అలాంటి పరిస్థితి మణిపూర్ కు చెందిన క్రీడాకారులకు ఎదురైంది. జాతుల మధ్య వైరంతో కొన్నినెలల పాటు భగ్గుమన్న మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సమసిపోలేదు. నిరసనల వల్ల ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు. ఇదే సమయంలో కప్పు గెలుచుకుని ఊరికెళ్లిన క్రీడకారుడు మటేకు సహాయక శిబిరమే దిక్కైంది.

మణిపుర్‌ కొద్ది నెలల క్రితం మొదలైన ఘర్షణల్లో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. నిరసనకారులు పలువురి ఇళ్లకు నిప్పంటించడంతో నిలువ నీడ లేక సహాయక శిబిరాల్లో తలదాచుకున్నవారు వారెందరో.  ఈ నేపథ్యంలో మణిపూర్ కు చెందిన గాంగుహౌమటే ఫుట్ బాల్ లో దేశానికి కప్పుకు గెల్చుకుని వచ్చాడు. మణిపూర్ లోని తెంగ్నౌపాల్‌ జిల్లాలోని అతడి ఇల్లు నిరసనల్లో కాలిపోవడంతో.. ఆ కుటుంబమంతా సహాయక శిబిరాల్లోనే ఉంటుంది.

గాంగుహౌమటే  అండర్-16 ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ ఉన్నాడు. అతడి సారథ్యంలోని భారత్ టీమ్ గత వారం భూటాన్‌ రాజధాని థింపులో జరిగిన సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఛాంపియన్‌ షిప్‌ను గెల్చుకుంది. కప్పుతో సగర్వంగా స్వదేశానికి గాంగుహౌమటే బృందం వచ్చింది. మటేకు స్వదేశంలోని తన రాష్ట్రంలో ఉండటానికి ఇల్లు లేకుండా పోయింది. అల్లర్ల కారణంగా తన ఇల్లు కోల్పోవడంతో కుటుంబం సభ్యులు సహాయ శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతోన్నారు. స్వస్థలానికి వచ్చిన మటేను కుటుంబసభ్యులు కాంగ్‌పోక్పీలోని శిబిరాల నుంచే ఆహ్వానం పలికారు. ఈ నిరసనల్లో తన ఇళ్లు కాలిపోయినా కూడా మటే మాత్రం శాంతి గురించే మాట్లాడాడు.

మణిపుర్‌లో సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు రావాలని కోరుకున్నాడు. తన వారంతా క్షేమంగా ఉన్నారని, అందుకు దేవుడికి కృతజ్ఞతలని మటే అన్నారు. మటేతో పాటు అండర్‌-16 జట్టులోని మరికొందరి సభ్యుల్ని మణిపూర్ లోని కాంగ్‌పోక్పీలో సత్కరించారు. 23 మంది సభ్యులు గల జట్టులో 15 మంది మణిపుర్‌కు చెందిన వారే కావడం గమనార్హం. మరి… ఈ క్రీడాకారుల విషాద స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.