iDreamPost
android-app
ios-app

హరి హర వీరమల్లు అసలు ఏమౌతుంది ?

  • Published Jul 08, 2025 | 12:41 PM Updated Updated Jul 08, 2025 | 12:41 PM

హరి హర వీరమల్లు.. ఈ సినిమా మీద నిన్న మొన్నటివరకు కూడా ఎన్నో అనుమానాలు, అసహనాలు. అసలు ఈ సంవత్సరం సినిమా వస్తుందా లేదా అని ఎంతో మంది సందేహ పడ్డారు. ఎందుకంటే ఇప్పటికే మూవీ ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయిన మాట వాస్తవం . దర్శకులు మారడం , సినిమా లేట్ అవ్వడంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు

హరి హర వీరమల్లు.. ఈ సినిమా మీద నిన్న మొన్నటివరకు కూడా ఎన్నో అనుమానాలు, అసహనాలు. అసలు ఈ సంవత్సరం సినిమా వస్తుందా లేదా అని ఎంతో మంది సందేహ పడ్డారు. ఎందుకంటే ఇప్పటికే మూవీ ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయిన మాట వాస్తవం . దర్శకులు మారడం , సినిమా లేట్ అవ్వడంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు

  • Published Jul 08, 2025 | 12:41 PMUpdated Jul 08, 2025 | 12:41 PM
హరి హర వీరమల్లు అసలు ఏమౌతుంది ?

హరి హర వీరమల్లు.. ఈ సినిమా మీద నిన్న మొన్నటివరకు కూడా ఎన్నో అనుమానాలు, అసహనాలు. అసలు ఈ సంవత్సరం సినిమా వస్తుందా లేదా అని ఎంతో మంది సందేహ పడ్డారు. ఎందుకంటే ఇప్పటికే మూవీ ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయిన మాట వాస్తవం . దర్శకులు మారడం , సినిమా లేట్ అవ్వడంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. లేటెస్ట్ గా జులై 24 న సినిమా అని అనౌన్స్ చేశారు కానీ. ఎక్కడో కొంచెం సినిమా చెప్పిన టైం కు వస్తుందా లేదా అనే సందేహాలైతే పోలేదు. కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అందరి ఒపీనియన్ మారిపోయింది. ఒక్కో షాట్ ఒక్కో విజువల్ ఎవరి ఊహకు అందని విధంగా ఉంది.

ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులే లేవు. ట్రైలర్ చూసి పండగ చేసుకుంటున్నారు. ట్రైలర్ గురించి చెప్పాలంటే నిర్మాత ఆశలను నిలబెట్టింది.. ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది.. బాక్స్ ఆఫీస్ కి పక్కా పైసా వసూల్ మూవీ అని ప్రామిస్ చేసింది. ఫైనల్ గా ఇన్నేళ్ల వెయిటింగ్ కు న్యాయం చేసింది. అభిమానులకు ఇంతకంటే కావాల్సింది ఏమి ఉంటుంది. పైగా ట్రైలర్ లోనే మూడు ముక్కల్లో కథను చెప్పకనే చెప్పేశారు. ‘హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం’ , ‘ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం’, ‘ఓ వీరుడి కోసం ప్రక్రుతి పురుడు పోసుకుంటున్న సమయం’.. కథ అంతా కూడా ఈ మూడు వాక్యాల చుట్టూనే తిరుగుతూ ఉంటుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఇక ఆ తర్వాత వచ్చిన ఒక్కో షాట్ అందరికి గూస్బంప్స్ తెప్పించింది. ఇదంతా సరే బాగానే ఉందిలే అనుకుంటే.. ఈలోపే ఈ చిత్రానికి మ‌రో రూపంలో పెద్ద అడ్డంకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ సినిమాను విడుద‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఆపేయాలంటూ ప‌లువురు కోట్లు మెట్లు ఎక్కేందుకు రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

ఇక ఇప్పటివరకు అయితే వీరమల్లు బిజినెస్ గురించి పెద్దగా చర్చలు లేవు. కానీ ఈ ట్రైలర్ తర్వాత ఈ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయని క్లియర్ గా అర్థమైపోతుంది. ఆల్రెడీ మూవీ మీద బజ్ ఉంది కానీ.. వాయిదాల వలన సరే వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అంతా అనుకున్నారు. ఇక ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని ట్రైలర్ తో చెప్పేసాడు హరి హరుడు. ఈ రేంజ్ లో ట్రైలర్ అందరిని ఇంప్రెస్ చేస్తుంది అనైతే ఎవరు ఊహించలేదు. ఇదే హైప్ రిలీజ్ తర్వాత కూడా ఉంటే సినిమా సక్సెస్ ను ఇంకెవరు ఆపలేరు. ఈలోపు మూవీ రిలీజ్ ఆపాలి అనుకుంటున్నవారు ఎంతవరకు వెళ్తారా అనే టెన్షన్ కూడా కనిపిస్తుంది. మరి ఇవన్నీ దాటుకుని మూవీ టీం ప్రమోషన్స్ ను ఏ విధంగా ప్లాన్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.