Tirupathi Rao
Tirupathi Rao
బుధవారం లోక్ సభలో తీవ్ర దుమారం రేగింది. అవిశ్వాస తీర్మానంలో జరుగుతున్న చర్చలో అధికార బీజేపీ, ప్రధానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని పరోక్షంగా లంకాశురుడితో పోలుస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. వాటిని అధికార పక్షం నేతలు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మీరు ఎవరూ భయపడకండి. నేను ఈరోజు అదానీ గురించి మాట్లాడటం లేదు అంటూ స్పీచ్ మొదలు పెట్టారు. “హింసాత్మక ఘటనలు జరుగుతున్న మణిపూర్ లో నేను పర్యటించాను. నేను సహాయక శిబిరాలకు వెళ్లాను. అక్కడ దురాగతాలు ఎదుర్కొన్న మహిళలతో నేను మాట్లాడాను. కొడుకుల మృతదేహాల వద్దనున్న తల్లులతో నేను మాట్లాడాను. కొందరు వారికి జరిగిన ఘోరాలను చెబుతూ కళ్లు తిరిగి పడిపోయారు. మణిపూర్ ని రెండుగా విడదీశారు మీరు. ప్రధాని మోదీ ఆ రాష్ట్రానికి ఎప్పుడూ వెళ్లలేదు. బీజేపీనే ఆ రాష్ట్రాన్ని రెండుగా విడదీసింది. మణిపూర్ లో మీరు భరత మాతను హత్య చేశారు.
మీరు దేశ భక్తులు కాదు.. మీరు దేశ ద్రోహులు. మణిపూర్ మహిళల బాధలు ఈ బీజేపీ వాళ్లకు అర్థం కావడం లేదు. రాముడు, హనుమంతుడు ఎవరూ రావణాసురుడిని చంపలేదు. రావణాసురుడిని అతని అహంకారమే అంతం చేసింది. మేదీ కేవలం ఇద్దరి మాటలే వింటారు. ఒకటి అమిత్ షా, రెండు అదాని. వీళ్లను దాటి ఆయన ఎవరి మాట వినరు” అంటూ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మణిపూర్ కోసం కాంగ్రెస్ నేతలు చేసిందేంటో చెప్పాలంటూ కోరారు.
What a powerful speech by #RahulGandhi regarding #Manipur issues… pic.twitter.com/e5KlVXGtal
— Shashi S Singh 🇮🇳 (@Morewithshashi) August 9, 2023