iDreamPost
android-app
ios-app

భైరవం OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే ?

  • Published Jul 08, 2025 | 12:58 PM Updated Updated Jul 08, 2025 | 12:59 PM

కొన్ని సినిమాలు థియేటర్ లో కంటే కూడా ఓటిటి లో ఒకింత ఎక్కువ మార్కులు సంపాదించుకుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ముగ్గురు హీరోల కమ్ బ్యాక్ మూవీ ఓటిటి ఎంట్రీ ఇవ్వనుంది. అదే నారా రోహిత్ , మంచు మనోజ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా.

కొన్ని సినిమాలు థియేటర్ లో కంటే కూడా ఓటిటి లో ఒకింత ఎక్కువ మార్కులు సంపాదించుకుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ముగ్గురు హీరోల కమ్ బ్యాక్ మూవీ ఓటిటి ఎంట్రీ ఇవ్వనుంది. అదే నారా రోహిత్ , మంచు మనోజ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా.

  • Published Jul 08, 2025 | 12:58 PMUpdated Jul 08, 2025 | 12:59 PM
భైరవం OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే ?

కొన్ని సినిమాలు థియేటర్ లో కంటే కూడా ఓటిటి లో ఒకింత ఎక్కువ మార్కులు సంపాదించుకుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ముగ్గురు హీరోల కమ్ బ్యాక్ మూవీ ఓటిటి ఎంట్రీ ఇవ్వనుంది. అదే నారా రోహిత్ , మంచు మనోజ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా. ఈ సినిమా థియేటర్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనే టాక్స్ కాకపోయినా సరే డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ డేట్ ఫిక్స్ అయింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్‌), వరద(నారా రోహిత్‌),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గుడి కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అనేది మిగతా కథ.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 దక్కించుకుంది. జూలై 18 నుంచి ఈ మూవీ జీ 5 లో ప్రసారం కానుంది. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారు ఎంచక్కా ఓటిటి లో చూసి ఎంజోయ్ చేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.