Swetha
మల్టీస్టారర్ సినిమా అంటే హీరోలు ఇద్దరు దర్శకుడితో కలిసి ప్రమోషన్స్, ఇంటర్వూస్ లో దర్శనం ఇస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా ఇదే ఆసిస్తూ ఉంటారు. గతంలో ఆర్ఆర్ఆర్ టైం లో జక్కన్న కూడా ఇదే చేశాడు. కానీ ఇప్పుడు రాబోయే ఈ మల్టీస్టారర్ సినిమాకు మాత్రం ఈ దర్శకుడు ఈ ఫార్మాట్ ఫాలో అవ్వడట
మల్టీస్టారర్ సినిమా అంటే హీరోలు ఇద్దరు దర్శకుడితో కలిసి ప్రమోషన్స్, ఇంటర్వూస్ లో దర్శనం ఇస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా ఇదే ఆసిస్తూ ఉంటారు. గతంలో ఆర్ఆర్ఆర్ టైం లో జక్కన్న కూడా ఇదే చేశాడు. కానీ ఇప్పుడు రాబోయే ఈ మల్టీస్టారర్ సినిమాకు మాత్రం ఈ దర్శకుడు ఈ ఫార్మాట్ ఫాలో అవ్వడట
Swetha
మల్టీస్టారర్ సినిమా అంటే హీరోలు ఇద్దరు దర్శకుడితో కలిసి ప్రమోషన్స్, ఇంటర్వూస్ లో దర్శనం ఇస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా ఇదే ఆసిస్తూ ఉంటారు. గతంలో ఆర్ఆర్ఆర్ టైం లో జక్కన్న కూడా ఇదే చేశాడు. కానీ ఇప్పుడు రాబోయే ఈ మల్టీస్టారర్ సినిమాకు మాత్రం ఈ దర్శకుడు ఈ ఫార్మాట్ ఫాలో అవ్వడట. ఎక్కడా కూడా హీరోలు ఇద్దరు కలవకుండా విడివిడిగా మూవీ ప్రమోషన్స్ చేయిస్తాడట. ఎంత పెద్ద మీడియా వారు అడిగినా సరే ఈ హీరోలు ఇద్దరు సెపరేట్ సెపరేట్ గా వస్తారు కానీ.. కలిసి మాత్రం రారని మూవీ టీం కన్ఫర్మ్ చేశారు.
ఆగష్టు 14 న ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ వార్ 2 రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే ఇదంతా. గతంలో వార్ మూవీ రిలీజ్ టైం లో కూడా హృతిక్ , టైగర్ శ్రోఫ్ లు సైతం ఇలానే విడివిడిగా సినిమాను ప్రమోట్ చేశారు. ఇక ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో కానున్నారు మూవీ టీం. ఇలాంటి ఓ క్రేజి కాంబినేషన్ ను అనౌన్స్ చేసినప్పటినుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ , తారక్ ను ఒకే ఫ్రేమ్ చూడాలని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఈలోపే ప్రమోషన్స్ లో ఇద్దరినీ కలిసి చూసేస్తే థియేటర్ లో ఆ థ్రిల్ ను మిస్ అవుతారని వారి ఆలోచనట.
ఓ రకంగా ఈ ఆలోచన కూడా మంచిదే అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ లో మాత్రం ఇద్దరు కలిసి కనిపిస్తారట. ఇక వార్ 2 కి టఫ్ కాంపిటీషన్ అంటే కూలి సినిమానే. లోకేష్ కనకరాజ్ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. సో వార్ 2 ఈ కాంపిటేషన్ ను తట్టుకోవాల్సి వస్తుంది. ఇక వార్ 2 తెలుగు రాష్ట్రాల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. సో దేవర రేంజ్ లో ఇక్కడ థియేటర్స్ దక్కుతాయని అంతా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 80 కోట్లకు డీల్ జరిగిందనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడ రికవరీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ భుజాల మీదే ఉంటుంది. తెలుగు జనాలు ఎక్కువ శాతం తారక్ ను చూడడానికి థియేటర్స్ కు వస్తారు. సో దానికి తగ్గట్టు భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేయనున్నారు టీం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.