iDreamPost
android-app
ios-app

మణిపూర్ లో మరో దారుణం.. తండ్రీ కొడుకులను కాల్చేశారు!

  • Author Soma Sekhar Published - 04:09 PM, Sat - 5 August 23
  • Author Soma Sekhar Published - 04:09 PM, Sat - 5 August 23
మణిపూర్ లో మరో దారుణం.. తండ్రీ కొడుకులను కాల్చేశారు!

గత కొన్ని నెలలుగా మణిపూర్ లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఎన్ని బలగాలు మోహరించినా.. కేంద్రం చర్యలు తీసుకుంటున్నా అల్లర్లు మాత్రం ఆగడం లేదు. రెండు తెగల మధ్య జరుగుతున్న ఈ అల్లర్లలో ఎందరో అమాయకులు బలవుతున్నారు. కొన్ని రోజుల క్రితం మహిళలను నగ్నంగా ఊరేంగించిన సంఘటన దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సంఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. ఈ దారుణం మరువక ముందే మణిపూర్ లో మరో ఘోరం చోటుచేసుకుంది.

మణిపూర్ అల్లర్లలో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల నగ్న ఊరేంగింపు సంఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘోరం మణిపూర్ లోని క్వాక్తా పట్టణంలో చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులను దుండగులు కాల్చేసి, కత్తులతో నరికి చంపారు. మరణించిన తండ్రీ కొడుకులు మైతేయి వర్గానికి చెందిన వారిగా గుర్తించారు. ఇన్ని రోజులు వీరు సహాయక శిబిరంలో తలదాచుకుని, ఇటీవలే ఇంటికి చేరుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. కాగా..దుండగులు పలు ఇళ్లను తగలబెట్టారని, ఈ దారుణంలో ముగ్గురు చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: తహసీల్దార్‌ వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య!

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş