గత కొన్ని నెలలుగా మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా ఎందరో మాన, ప్రాణాలు కోల్పోతున్నారు. ఊర్లకు ఊర్లను తగలబెడుతున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా తయ్యారు అయ్యింది. ఇలాంటి సమయంలో కేరళ రాష్ట్రం మణిపూర్ విద్యార్థులకు అండగా నిలిచింది. కేరళ రాష్ట్రానికి చెందిన కన్నూర్ యూనివర్సిటీ మణిపూర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ప్రవేశాలను కల్పించేందుకు ముందుకువచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవాలనుకునే విద్యార్థులు తమను సంప్రదించాలని యూనివర్సిటీ వీసీ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ చెప్పారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల భవిష్యత్ ఏంటి? అనే ప్రశ్నకు జవాబుగా నిలిచింది కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ. మణిపూర్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మణిపూర్ విద్యార్థి సంఘాల నుంచి కన్నూర్ యూనివర్సిటీకి అభ్యర్థనలు వచ్చాయి. వాటిని పరిగణంలోకి తీసుకున్న విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీ గోపీనాథ్ తెలిపారు. ఈ అంశంపై యూనివర్సిటీ సిబ్బందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే మణిపూర్ లో విద్యకు దూరం అవుతున్న విద్యార్థులకు ప్రత్యేక సీట్లను యూనివర్సిటీలో కేటాయిస్తామని తెలిపారు. ప్రవేశం పొందిన తర్వాత సర్టిఫికెట్లు సమర్పించేందుకు తగినంత సమయాన్ని కూడా వారికి కల్పిస్తామని యూనివర్సిటీ ఉపకులపతి తెలిపారు. కాగా.. మణిపూర్ కు చెందిన ఓ బాలుడు కేరళలో మూడో తరగతి లో చేరిన విషయం తర్వాతే మాకు ఈ అభ్యర్థనలు వచ్చినట్లుగా వారు తెలిపారు.
ఇదికూడా చదవండి: దారుణం: కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని ఉద్యోగిని కొట్టి చంపిన గ్రామస్తులు!