సైనికులు దేశ సరిహద్దుల్లో ఉంటూ రేయింబవళ్లు మన కోసం పని చేస్తుంటారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తుపాకల మధ్య జీవనం సాగిస్తూ దేశాన్ని రక్షిస్తుంటారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తుంటారు. ఇతర దేశాలు యుద్ధాలకు వస్తే.. ప్రాణలను సైతం లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడుతుంటారు. అలాంటి వారి కుటుంబానికి అన్యాయం జరిగితే.. వారు కాపాడుకోలేని స్థితిలో ఉంటే.. ఇక ఆ సైనికుడు మనోవేదన వర్ణాతీతం. తాజాగా మణిపూర్ ఘటనలోని బాధితులోని ఓ మహిళ భర్త.. భారత సైన్యంలో పని చేశారు. దేశాన్ని రక్షించినా.. నా భార్యను కాపాడుకోలేక పోయానంటూ వాపోయారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి గ్రామంలో ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. అసలు మనం మనషుల మధ్యనే ఉన్నామా? అనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన వారిని చూసి.. జంతువులు కూడా తూ.. అని ఉమ్మేస్తాయి. కొందరు ఆయుధాలు చేతబట్టి.. గ్రామంపై దాడి చేసి, ఇళ్లకు నిప్పు అంటించారు. యథేచ్చగా అత్యాచారాలు,హత్యలు చేసి.. మారణహోమం సృష్టించారు. ఈఘటనలో బాధితురాలు ఓ మాజీ సైనికుడి భార్య అని తెలిసింది.
తాజాగా ఆ మాజీ సైనికుడు స్పందిస్తూ.. తాను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్ని దేశాన్ని రక్షించుకున్నప్పటికీ.. ఈ దారుణ ఘటన నుంచి మాత్రం తన భార్యను రక్షించుకోలేక పోయానని కన్నీటి పర్యతమయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…” నేను కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాటం చేశాను. అలానే భారత శాంతి బృందంలో భాగంగా శ్రీలంకలోనూ పని చేశాను. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, నా భార్యను, నా గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేక పోయాను. ఈ ఘటన నన్నెంతో మానసిక వేదనకు గురి చేస్తోంది” అని ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ఆ మాజీ సైనికుడు కన్నీటి పర్యతం అయ్యారు. ఈ ఘటన జరిగే సమయంలో పోలీసులు అక్కకడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, ఇంతటి దారుణానికి పాల్పడిన దుండగులకు కఠిన శిక్ష విధించాని ఆ కార్గీల్ వీరుడు డిమాండ్ చేశాడు.
భారత సైన్యంలో పని చేసిన ఆయన .. ఆస్సాం రెజిమెంట్ లో సుబేదార్ గా సేవలందిచినట్లు సమాచారం. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను ఉరి తీయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. సమాజం ఎటువైపు వెళ్తోందంటూ ప్రజలు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈఘటనలో బాధిత మహిల్లో ఒకరి భర్త.. దేశాన్ని రక్షించే సైనికుడు కావడం అందరిని కలచివేస్తూంది. దేశానికి సేవలందించిన ఆయన కుటుంబానికే ఇలా జరిగితే మిగిలిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. మాజీ సైనికుడు కన్నీటిగాథ న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.