కర్నూలులోని జనసేన పార్టీ కార్యాలయాన్ని యజమానులు ఖాళీ చేయించారు. రెండురోజుల క్రితం కార్యాలయం ఖాళీ చేయాలని నిర్వాహకులకు యజమానులు చెప్పారు. అయితే తమకు ఐదేళ్ల పాటు అగ్రిమెంట్ ఉందని, అద్దె క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామంటూ నిర్వాహకులు ఖాళీ చేయలేదు. ఈ క్రమంలో ఈ రోజు కొంతమంది పార్టీ కార్యాలయం వద్దకు వచ్చారు. కార్యాలయంలోని ఫర్నీచర్ను బయటపడేసి, తాళం వేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జనసేన నేతలు వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు […]
జనసేన- బీజేపీల మధ్య రోడ్ మ్యాప్ విషయంలో ఇంకా క్లారిటీ వచ్చినట్టు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై ఆ మర్నాడే స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చే ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో తమకు పార్టీ సీనియర్ నేత అమిత్ షా రోడ్ మ్యాప్ […]
ఆమె ఓ సినీనటి. గతంలో పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందారు. తర్వాత తెరమరుగైపోయారు. రాజకీయాల్లోనూ రాణించాలని కొన్నేళ్లుగా తెగ ఉబలాట పడిపోయారు. గత ఎన్నికల సమయంలో ప్రయత్నించి విఫలమయ్యారు. మూడేళ్లుగా జాడ లేకుండా పోయారు. మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యారు. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆ మధ్య అక్కడ హడావుడి చేశారు. కానీ ఏ పార్టీ అన్నది ఆమెకే క్లారిటీలేదు.ఆదరించే పార్టీ కోసం ఎదురుచూస్తున్న ఆ […]
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని పార్టీ ఆవిర్భావసభలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలు అనుకూల ఓటుపై దృష్టి సారించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు అన్నీ కలసి పోటీ చేసినా వైఎస్సార్ సీపీని 2024 ఎన్నికల్లో నిలువరించగలవా? అంటే సందేహమే. 2019 ఎన్నికల్లో 50 శాతం పైగా ఓట్లతో 151 స్థానాలను అంటే 86 శాతం అసెంబ్లీ సీట్లను వైఎస్సార్ సీపీ సాధించింది. ఆ […]
ఈమధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ రాష్ట్రంలో దుమ్ము దులిపింది. సామాన్యుడి చీపురు అధికారంలో ఉన్న కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలను ఊడ్చి పారేసింది. కాకలుతీరిన యోధులను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకుంది. ఢిల్లీ దాటి పంజాబులోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడికి కొద్దిరోజుల వ్యవధిలో ఏపీలో జనసేన పార్టీ ఎనిమిదేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుని తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం […]
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది నిజమేనని అనేకసార్లు రుజువైంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల మాదిరిగా.. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కూడా మారిపోతుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తు పెట్టుకుని,ఆ తంతు కాస్త అయిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటుంటారు. మరికొన్ని పార్టీలు పాత మిత్రులను వదిలేసి.. కొత్త మిత్రులతో స్నేహం చేస్తుంటాయి. అలాంటి పార్టీల అధినేతలపై పాత మిత్రులు గుర్రుగా ఉంటుంటారు. ఈ తరహాకు చెందిన పార్టీలే జనసేన, […]
కొంతమందికి తన పాత మిత్రులు తన కన్నా ఉన్నత స్థితిలో ఉంటే కంటగింపుగా ఉంటుంది. అసూయతో రగిలిపోతారు. తాను కూడా ఇదే కోవకు చెందిన వాడినే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించుకుంటున్నారు. పాత మిత్రులు, ప్రస్తుత మంత్రులు అవంతి శ్రీనివాసరావు, వెల్లంపల్లి శ్రీనివాస్లపై పవన్ కళ్యాణ్ తరచూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి వారిపై విమర్శలు, వెటకారపు మాటలతో తన కడుపు మంటను చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జనసేన ఆవిర్భావ […]
సొంతంగా రాజకీయపార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీకి సొంతంగా రాజకీయ ఎజెండా కూడా ఉండాలి. అలా సొంత పార్టీ మాత్రమే ఉండి సొంత ఎజెండా లేకపోవడం ఏ తరహా రాజకీయమో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పాలి. అలా సొంత రాజకీయపార్టీ ఉండి దానికి రాజకీయ ఎజెండా లేక రోడ్ మ్యాప్ కోసం ఇంకో రాజకీయపార్టీపై ఆధారపడడం రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నాం. ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎలా అర్ధం చేసుకుంటున్నారో కానీ, ప్రత్యర్థులే కాదు రాజకీయవిశ్లేషకులు కూడా దీన్ని ఓ రాజకీయ సినిమాగా మాత్రమే […]
పెళ్లి, రెండు,మూడు నెలలు ఆలస్యం అయినా పరవాలేదు ముందు నిశ్చితార్థం జరిపించాలని ఆడపిల్ల తండ్రి ఆతృత పడతాడు. అచ్చంగా అలాగే ఉంది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరవాలేదు ముందుగా పొత్తులు ఖాయం చేసుకోవాలని ఆయన కంగారు పడుతున్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా మొట్టమొదటి సారిగా 2019 ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మళ్లీ అలాంటి సాహసం చేయడానికి బాబు ఇష్టపడడం లేదు. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ […]
ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార వైఎస్సార్సీపీని ధీటుగా ఎదుర్కొనే స్థితిలో ఏ పార్టీ లేదన్నది నిర్వివాదాంశం. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వృద్ధ నిర్ణయాలతో సతమతమవుతోంది. బీజేపీ తన మూలాలను జనంలోకి జొప్పించే ప్రయత్నాల్లోనే ఇంకా ఉంది. సంస్థాగత నిర్మాణం చేయలేక జనసేన మల్లగుల్లాలు పడుతోంది. కామ్రేడ్లు తడవకోసారి ఏదో ఒక పార్టీకి ఆసరాగానే మిగిలిపోతున్నారు. ఎంతో కొంత ప్రతిపక్షం అనదగ్గ పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు మాత్రమేననిప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. ఇందులో కూడా ఏపీ […]