iDreamPost

నాగబాబు పోస్ట్ చేసింది ఎవరి గురించి? ఓ పెద్ద చర్చే జరుగుతోంది!

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు ఏకకాలంలో మే 13న నిర్వహించిన సంగతి విదితమే. ఓటర్లు తండోప తండాలుగా పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు ఏకకాలంలో మే 13న నిర్వహించిన సంగతి విదితమే. ఓటర్లు తండోప తండాలుగా పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు..

నాగబాబు పోస్ట్ చేసింది ఎవరి గురించి? ఓ పెద్ద చర్చే జరుగుతోంది!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు మే 13న ఎలక్షన్స్ జరిగాయి. ఎండలు మండిపోతున్నా.. పలు చోట్ల వానలు కురుస్తున్నా వెనకడు వేయకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏపీ ప్రజలు. క్యూలైన్లలో గంటల గంటల పాటు నిలబడి.. ఓటు వేశారు. పట్టణాలు, నగరాలు, పల్లెటూళ్లలో ఓటింగ్ శాతం గతం కన్నా పెరిగింది. ఇంచు మించు 80 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగిన సంగతి విదితమే. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ ఎన్నికల వేడీ అలా తగ్గిందో లేదో ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

అదే మెగా స్టార్ చిరంజీవి సోదరుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పాటు పెను దుమారం రేపుతోంది. ఎన్నికల రోజున తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా ఆయనొక ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇంతకు నాగబాబు ఆ ట్వీట్‌లో ఏమన్నారంటే..? ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు దీనిపై పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు, ఓటర్లు. ఎవరినీ ఉద్దేశించి.. ఈ వ్యాఖ్యలు చేశారంటూ చర్చించుకుంటున్నారు. కాగా, ఎన్నికలు ముగిసే సమయంలో ఈ ట్వీట్ వెనుక పరమార్థం ఏంటీ అని ప్రశ్నించుకుంటున్నారు.

ఎవరినీ టార్గెట్ చేస్తూ నాగ బాబు ఈ వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజల్లో. అంతేకాకుండా  జన సేన నేతల్లో కూడా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకు (కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ జరుగుతుంది) ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. ఇటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజెపీ కీలక నేతలు కూడా ఈ అంశంపై మాట్లాడుతుండటం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. సోదరుడు, జన సేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్, కూటమి అభ్యర్థిగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలో కీలక నియోజక వర్గంగా మారింది. ఈ క్రమంలో సోదరుడి తరుఫున ప్రచారాల్లో పాల్గొన్నాడు నాగబాబు. ఇప్పుడు ఎన్నికలు ముగింపు వేళ.. పరాయి వాడు.. మావాడు అంటూ వ్యాఖ్యలను చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి