ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు నిరాశను కలిగించాయి. ఉత్తరప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో మళ్లీ బీజేపీనే అధికారం వరించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆప్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొన్నాయి. పంజాబ్‌లో బీజేపీ బలంగా లేదు. ఆ రాష్ట్రంలపై కమలం పార్టీ ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఐదు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌పైనే బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. […]
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే తన ఆకాంక్షను పలు సందర్భాల్లో వెలిబుచ్చుతూనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఇదే సరైన సమయమని భావించిన కేసీఆర్ ఆ దిశగా ప్రయాణించేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్న కేసీఆర్.. తన మూడో రోజు పర్యటనలో బీజేపీ నేత […]
గత ఏడాది నవంబర్ 26వ తేదీన నూతనసాగు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు మొదలుపెట్టిన ఉద్యమం కీలక మలుపు తిరిగింది. గత నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు, ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పరిణామాల తర్వాత రెండు రోజులు ఉద్యమ తీవ్ర తగ్గినట్లు కనిపించినా.. భారతీయ కిసాన్ యూనియన్ నేత (బీకేయూ) రాకేష్ టికాయత్ రాకతో రైతు ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. మునుపటి కన్నా ఉద్యమ తీవ్రత […]
నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రెండు నెలలుగా ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. వర్షంలో తడిచారు. అర్థాకలితో గడిపారు. వీళ్లు రైతులేనా అంటూ చేసిన అవహేళనలను సహించారు. అవమానాలను దిగమింగారు. రెచ్చగొట్టినా శాంతియుతంగా నిలిచారు. 150 మంది అన్నదాతలు అశువులుబాసారు. కేసులు ఎదుర్కొన్నారు. అరాచక శక్తులు ట్రాక్టర్ ర్యాలీని ఉద్రిక్తతంగా మార్చినా.. అన్నదాతల పట్టుసడలలేదు. అయినా.. కేంద్ర ప్రభుత్వంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. అన్నదాతల […]
రెండు నెలలుగా ఎముకలు కొరికే చలిలోనే ఉంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. డిమాండ్లపై సానుకూలంగా స్పందించని కేంద్ర ప్రభుత్వ తీరుపై అన్నదాత కన్నెర్రజేశారు. ఇప్పటి వరకు ఢిల్లీ నగరం బయట శాంతియుతంగా నిరసన చేపట్టిన అన్నదాతలు.. తమ ఉద్యమం పంథాను మార్చారు. కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తాను తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌లో భాగంగా.. ఈ రోజు గణతంత్ర దినోత్సవం రోజున.. ట్రాక్టర్లతో కిసాన్ గణతంత్ర పరేడ్‌ను రైతులు చేపట్టారు. ఢిల్లీ […]
తాడో పేడో తేల్చుకోమంటారు..పెద్దలు. అంతేకాదు అదే సమయంలో తెగేదాకా లాగొద్దని చెబుతారు ఆ పెద్దలే..అంటే అర్దం సందర్భాను సారం..నిర్ణయం తీసుకోవాలని అర్దం.. అంతేకాని తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చింది కాబట్టు తాము పట్టిన కుందేటికి ముూడేకాళ్లు అనడం సరైంది కాదన్నది దాని పరోక్ష హెచ్చరిక..ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ప్రపంచాన్ని కదిలించిన రైతు పోరాటం సుప్రీం తీర్పుతో చివరి దశకు చేరిందనే చెప్పాలి. రైతు ఉద్యమంపై సుప్రీం కోర్టు స్పందించి తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు కేంద్రాన్ని […]
రైతులతో కేంద్రం చర్చలు కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం మరోసారి కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఆ చర్చలకు ముందు ప్రభుత్వానికి సవాల్ విసిరేందుకే అన్నట్లు ఢిల్లీ శివార్లలో రైతన్న ట్రాక్టర్లతో కదం తొక్కాడు. వేల మంది రైతులు పంజాబ్, హరియాణా, ఢిల్లీ శివార్ల నుంచి నాలుగు మార్గాల మీదుగా దాదాపు 3,500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో 43 రోజులుగా చలి, […]
రైతు ఉద్యమం ప్రభావం కార్పోరేట్ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఏక కాలంలో అటు కేంద్రంతోనూ, ఇటు కార్పోరేట్ సంస్థలతోనూ తలపడుతున్నారు. నూతన చట్టాల వల్ల కార్పోరేట్ కంపెనీలే లాభపడతాయని ఆరోపిస్తున్న రైతులు అంబానీ, అదానీ కంపెనీల ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ సంస్థకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ మొదలైంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో రిలయన్స్ సంస్థ ఉత్పత్తులను ప్రజలు తిరస్కరిస్తున్నారు. దాదాపు […]
కాలానికి లెక్కలు తెలియవు. తేదీలు, సంవత్సరాలు మనం కౌంట్ చేయాల్సిందే. అలల్లా కాలం కదులుతూనే వుంటుంది. కొత్త ఏడాది వచ్చి రెండు రోజులైంది. ఏమీ జరగదు, ఏదీ అంత సులభంగా మారదు, కానీ ఏదో ఆశ. నా చిన్నతనంలో అన్ని రోజుల్లానే జనవరి ఫస్ట్ కూడా. మామూలు జనం పట్టించుకునే వాళ్లు కాదు. 1971 జనవరి ఫస్ట్ నాటికి నేను ఐదో తరగతి. న్యూ ఇయర్ అని మా చిన్నాన్న కొంచెం హడావుడి చేశాడు. అప్పటికి ఆయన […]
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్నారు. శాంతియతంగా సాగుతున్న ఈ ఉద్యమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఆరో విడత చర్చలు సాగాయి. మునుపటి చర్చల కన్నా.. ఈ దఫా చర్చలు కొద్దిమేర ఫలవంతం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగింది. రైతులు కేంద్ర ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు పెట్టాగా అందులో విద్యుత్ చట్ట సవరణ […]