సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని కొంతమంది సరిగ్గా అర్ధం చేసుకోక దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దొరికిందే సందని అగ్నిపథ్ ని వ్యతిరేకిస్తూ యువతని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ ని వ్యతిరేకిస్తూ హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. ఇవాళ (జూన్ 17) ఉదయం నుంచి సికింద్రాబాద్ లో కూడా కొంతమంది పక్కా ప్లాన్ చేసి రైల్వేలను, రైల్వే ఆస్తులని నాశనం చేశారు. దీంతో సికింద్రాబాద్ రణరంగంగా మారింది. […]
సృజనాత్మకత పేరుతో వచ్చే కొన్ని ప్రకటనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటాయి. క్రియేటివిటీతో ఫలానా ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో హద్దు దాటిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రకటనలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేరుగా యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖ రాసింది. కొన్ని పర్ఫ్యూమ్/ బాడీ స్ప్రే ప్రకటనలు శృతి మించుతున్నాయని కేంద్ర శాఖ పేర్కొంది. సామూహిక అత్యాచారాలను ప్రోత్సహించేలా చిత్రీకరించిన సదరు ప్రకటనలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. మహిళల నైతికత, […]
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.. ఆపత్కాలంలో ఆక్సిజన్ సరఫరా చేస్తూ దేశానికి ఊపిరిపోస్తోంది.. మరి ప్రైవేటుకు తెగనమ్మి ఉంటే.. ఇప్పుడు ప్రభుత్వానికి సాయపడేదా? ఇండియన్ రైల్వే.. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రాణవాయువును సేకరించి.. అవసరమైన చోటుకు సప్లై చేస్తోంది. రైళ్ల బోగీలను ఐసోలేషన్ సెంటర్లుగా మారుస్తోంది. వేలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. మరి ప్రైవేటుపరం చేసి ఉంటే ప్రభుత్వం కోసం పని చేసేదా? ప్రభుత్వ సంస్థ అంటే బాధ్యత.. ప్రైవేటు సంస్థగా మారితే బిజినెస్. ఈ […]
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. దాన్ని అరికట్టడంలోనూ, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల ధర లు, ఆక్సిజన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అస్తవ్యస్త విధానాలను సరిచేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నడుం బిగించింది. కరోనా కట్టడి చర్యలపై విచారణ జరుపుతున్న కేంద్రం ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్ర దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించిన తర్వాత.. సుప్రిం ఈ ప్రశ్నలు సంధించడం సదరు అఫిడవిట్లో సమగ్ర సమాచారం లేదన్న విషయాన్ని తెలియజేస్తోంది. కరోనా […]
దేశం వెలిగిపోతోంది.. ఇది బీజేపీ స్లోగన్. కానీ ఇప్పుడు కరోనా సునామీలో భారత దేశం మునిగిపోతోంది. వైరస్ తో పోరులో గెలిచామంటూ ముందే సంబరాలు చేసుకున్న ప్రధాని మోడీ.. ఇప్పుడు మాత్రం జాగ్రత్తే మందు అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని.. భారమంతా రాష్ట్రాలపై వేశారు. నరేంద్ర మోడీ.. ఎప్పుడు ఏది మాట్లాడాలో.. ఎక్కడ ఏ స్విచ్ నొక్కాలో తెలిసిన వ్యక్తి! ఏడేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్నా ఒక్కసారి కూడా ప్రెస్ […]
కోవిడ్ కరాళ నృత్యం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. గత ఏడాది మాదిరిగా దేశవ్యాప్త సంపూర్ణ లాక్ డౌన్ విధించేందుకు విముఖంగా ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కేంద్రం .. అదే స్థాయి కఠిన ఆంక్షలతో ఎక్కడికక్కడ కేసులు తీవ్రతను బట్టి మినీ లాక్ డౌన్ విధించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల వ్యవధిలో పది శాతానికి మించి పాజిటివ్ కేసులు నమోదైన లేదా ఆక్సిజన్, ఐసీయు పడకల ఆక్యుపెన్సీ 60 […]
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వైఖరి కనిపిస్తోంది. కరోనా మొదటి వేవ్ లో ప్రజల దగ్గర నుంచి పీఎం కేర్ ఫండ్స్ పేరుతో భారీగా విరాళాలు పోగు చేసిన కేంద్ర ప్రభుత్వం తాపీగా ఇప్పుడు ఆ డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ లు నిర్మించాలని భావిస్తోంది. లక్ష్యం మంచిదే అయినా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు నిర్వర్తించడం పైనే విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ప్లాంట్లను పిఎం కేర్ విరాళాలతో నిర్మించాలని తాజాగా కేంద్ర […]
ఏపీలోని సచివాలయ వ్యవస్థ మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. అవార్డులు, అభినందనలే పనితీరుకు గీటురాయి. ఆ వ్యవస్థ గొప్పతనానికి కొలమానాలు. ఇప్పుడు అలాంటి అభినందనలనే ఏపీ పొందుతోంది. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత ఏపీలో పైరవీలకు తావులేని పాలన అందుతోంది. ఫలితంగా గ్రామ పాలన వికసిస్తోంది. అందుకే, గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. సందర్భమైనా, అసందర్భమైనా […]
కరోనా వైరస్ ఉధృతి దేశాన్ని వణికిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ నెలలో రోజుకు గరీష్టంగా 97 వేల కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్యకు మూడు రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండడం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. కొత్త కేసుల నమోదుతోపాటు మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు పోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కట్టడికి రెండుదారులు.. […]
వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. వ్యాక్సిన్ విధానంపై సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో వ్యాక్సిన్ నూతన పాలసీని ప్రకటించింది. వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి విక్రయించేలా, మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్లలో విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ […]