Nidhan
PM Modi Inaugurates Vande Metro In Gujarat: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మీద వరాల జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి భారీ ప్రాజెక్ట్‌లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఏంటా ప్రాజెక్టులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
PM Modi Inaugurates Vande Metro In Gujarat: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మీద వరాల జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి భారీ ప్రాజెక్ట్‌లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఏంటా ప్రాజెక్టులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సొంతరాష్ట్రం గుజరాత్ మీద వరాల జల్లు కురిపించారు. భారీ ప్రాజెక్టులను ఆ రాష్ట్రానికి ఆయన బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ ఇవాళ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏకంగా రూ.8 వేల కోట్ల ప్రాజెక్ట్స్‌ను ఆయన గిఫ్ట్‌గా ఇచ్చారు. దేశ మొట్టమొదటి వందే మెట్రోను స్టార్ట్ చేశారు. భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు నడిచే ఈ మెట్రోను ఆయన జెండా ఊపి మొదలుపెట్టారు. ఈ వందే మెట్రోకు ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా నామకరణం చేశారు. అంతేకాదు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో మరిన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారాయన. ఈ టూర్ కోసం నిన్న సాయంత్రం అహ్మదాబాద్‌కు చేరుకున్న మోడీ.. ఇవాళ మొదట వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత వందే మెట్రోను స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన ఏమేం చేశారు? గుజరాత్లో ఆయన ప్రారంభించిన భారీ ప్రాజెక్టులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఆ తర్వాత అహ్మదాబాద్ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ఫేజ్-2ను మొదలుపెట్టారు. గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జీఎంఆర్సీ), గుజరాత్ రాష్ట్ర సర్కారుతో కలసి ఈ ప్రాజెక్ట్‌ను డెవలప్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలసి మెట్రో రైలులో ప్రయాణించారు మోడీ. సెక్షన్ 1 నుంచి గిఫ్ట్ సిటీ వరకు ఆయన ట్రావెల్ చేశారు. ఈ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్‌కు అయిన మొత్తం వ్యయం రూ.5,384 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఫ్రాన్స్‌లోని ఏఎఫ్‌డీ, జర్మనీలోని కేఎఫ్‌డబ్ల్యూ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి లోన్స్ ద్వారా అవసరమైన నిధులు సమకూరాయి.
అహ్మదాబాద్‌లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు మోడీ. అక్కడి 30 మెగావాట్ల సోలార్ సిస్టమ్‌ను ఇవాళే స్టార్ట్ చేయనున్నారు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ కింద 30 వేలకు పైగా ఇళ్లను ఆమోదించనున్నారు. ఈ స్కీమ్‌లోని ఇళ్లలో తొలి విడతకు సంబంధించినవి విడుదల చేయనున్నారు. పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాలను కూడా సోమవారమే ప్రారంభించనున్నారు మోడీ. వీటితో పాటు సమాఖియాలీ-గాంధీధామ్, గాంధీధామ్-ఆదిపూర్ రైల్వే లైన్లను మొదలుపెట్టనున్నారు. ఏఎంసీ, అహ్మదాబాద్ రోడ్లను ప్రారంభించడంతో పాటు బక్రోల్, హాతీజన్, రామోల్, పంజర్పోల్ జంక్షన్స్‌లో నూతనంగా నిర్మించనున్న ఫ్లైఓవర్స్కు శంకుస్థాపన చేయనున్నారు. ఇలా మొత్తంగా ఒకే పర్యటనతో గుజరాత్లో భారీగా అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మొదలుపెడుతున్నారు. మరి.. గుజరాత్ మీద మోడీ భారీగా వరాల జల్లు కురిపించడం, రూ.8 వేల కోట్లను బహుమతిగా ఇవ్వడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Inaugurated Phase-II of the Ahmedabad Metro Rail Project and on the way to today’s programme with energetic youngsters. pic.twitter.com/59sGNf7kdd
— Narendra Modi (@narendramodi) September 16, 2024