iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి కేబినెట్ ఆమోదం..

Union Cabinet Approved Unified Pension Scheme: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త పెన్షన్ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానం ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తుందని వెల్లడించారు.

Union Cabinet Approved Unified Pension Scheme: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త పెన్షన్ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానం ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తుందని వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి కేబినెట్ ఆమోదం..

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శనివారం నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. పెన్షన్ స్కీమ్ కి సంబంధించి ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త పెన్షన్ విధానానికి ఆమోదం తెలిపింది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల 23 లక్షల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాలు కూడా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని ఎంచుకుంటే.. లబ్ధిదారుల సంఖ్యం 90 లక్షలకు చేరుతుందని తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బ్రీఫింగ్ ఇచ్చారు.

కేంద్రం తీసుకొస్తున్న ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగులకు రూ.800 కోట్లు ఎరియర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త పెన్షన్ స్కీమ్ వల్ల తొలి ఏడాది రూ.6,250 కోట్లు ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి తెస్తామని తెలిపారు. నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS), యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS) ఈ రెండింటిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చిన పెన్షన్ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఎన్పీఎస్ పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు కూడా యూపీఎస్ కి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. యూపీఎస్ విధానం ద్వారానే ఉద్యోగులకు ఎక్కువ మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ కొత్త పెన్షన్ విధానం ప్రకారం కనీసం 25 ఏళ్లు పని చేసిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు.. 12 నెలల బేసిక్ పేలో 50 శాతాన్ని పెన్షన్ గా ఇస్తారు. ఈ కొత్త పెన్షన్ విధానం అమలు కావాలి అంటే ఉద్యోగి కనీసం 10 ఏళ్లు సర్వీస్ చేయాలి. పదేళ్లు సర్వీస్ చేసిన వారికి నెలకు రూ.10 వేలు పెన్షన్ అందుతుందని హామీ ఇచ్చారు. ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి 60 శాతం పెన్షన్ అందుతుందని చెప్పారు. ప్రతి ఆరు నెలల సర్వీసులో నెల జీతంలోని 1/10వ వంతు జీతాన్ని(జీతం+ డీఏ)ని పదవీ విరమణ సమయానికి జోడిస్తారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.