iDreamPost
android-app
ios-app

మీ దగ్గర Gold ఉందా? కేంద్రం నుంచి షాకింగ్ రూల్స్.. ఆ ట్యాక్స్ లు కట్టాల్సిందే!

  • Published Nov 06, 2024 | 5:04 PM Updated Updated Nov 06, 2024 | 5:04 PM

Gold: బంగారం ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ రూల్స్ తీసుకొచ్చింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోతారు.

Gold: బంగారం ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ రూల్స్ తీసుకొచ్చింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోతారు.

మీ దగ్గర Gold ఉందా? కేంద్రం నుంచి షాకింగ్ రూల్స్.. ఆ ట్యాక్స్ లు కట్టాల్సిందే!

బంగారం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా దాన్ని కొనాలంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిందే. బంగారం వాల్యు ఎప్పటికీ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే అందరూ కూడా బంగారాన్ని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే బంగరాన్ని కొనలనుకునే వారు, బంగరాన్ని వాడుతున్న వారికీ ఇప్పుడు చెప్పే న్యూస్ కచ్చితంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై బంగారాన్ని కొనాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బంగారంపై కొత్త రూల్స్ ని ప్రవేశపెట్టింది. అవి తెలిస్తే వామ్మో బంగారాన్ని మైన్టైన్ చేయాలంటే ఇంత కట్టలా? అని తప్పకుండా అనుకుంటారు. ఇంతకీ కేంద్రం పెట్టిన ఆ రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేంద్ర ప్రభుత్వం బంగారంపై ట్యాక్స్ రూల్స్ ని మార్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది జూలైలోనే 2024-25 బడ్జెట్‌ను సమర్పించినప్పుడు మూలధన లాభాల పన్నుకు(Capital Gains Tax) సంబంధించిన రూల్స్‌ ను మార్చారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇన్కమ్ ట్యాక్స్ లో ఇండెక్సేషన్ బెనిఫిట్ పొందని వారు మాత్రం తక్కువ తక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.కొత్త రూల్స్ ప్రకారం బంగారు ఆభరణాల నుంచి డిజిటల్ బంగారం, బంగారు ఈటిఎఫ్‌ల వరకు ప్రతిదానిపై కూడా ట్యాక్స్ కట్టాలి. ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాలు, చైన్‌ల రూపంలో కొత్త బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు 3 శాతం జీఎస్టీ కట్టాలి. అలాగే కొత్త ఆర్నమెంట్స్‌ కొన్నప్పుడు బంగారం ధర, ఆభరణాల తయారీ ఛార్జీలను లెక్కించి మరీ ట్యాక్స్‌ వేస్తారు. ఆ ట్యాక్స్ కూడా కట్టాలి.

ఇక ఎక్స్ఛేంజ్ ప్రాసెస్ లో పాత బంగారు ఆభరణాలను ఇచ్చేసి కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేవారికి కూడా చెల్లింపుల బెడద తప్పదు. మన పాత బంగారాన్ని అమ్మేసినట్టు పరిగణిస్తారు. దీనిపై కూడా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం పాత బంగారాన్ని 2 సంవత్సరాల తర్వాత అమ్మినట్లైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ ట్యాక్స్ కచ్చితంగా కట్టాలి. అలాగే రెండేళ్ల కంటే తక్కువ టైమ్ లో బంగారాన్ని అమ్మేసినా కూడా ట్యాక్స్ కట్టాలి. దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ ట్యాక్స్ అంటారు. డిజిటల్ గోల్డ్.. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా ట్యాక్స్ కట్టాలి. ఇదీ సంగతి. కాబట్టి గోల్డ్ కొనే వారు ఈ ట్యాక్స్ రూల్స్ తెలుసుకొని కొంటె మంచిది. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.