iDreamPost
android-app
ios-app

POCSO Act: పోక్సో చట్టం అంటే ఏమిటి! అసలు ఆ చట్టం ఎందుకు వచ్చింది! పూర్తి స్టోరీ!

POCSO Act: ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ..లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోక్సో చట్టం అంటే ఏమిటి?. దాని వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

POCSO Act: ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ..లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోక్సో చట్టం అంటే ఏమిటి?. దాని వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

POCSO Act: పోక్సో చట్టం అంటే ఏమిటి! అసలు ఆ చట్టం ఎందుకు వచ్చింది! పూర్తి స్టోరీ!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ..లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో పోక్సో  చట్టం కింద కూడా జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పోక్సో చట్టం అంటే ఏమిటి అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. పోక్సో చట్టం అంటే ఏమిటి?. అది ఎలా వచ్చింది?. పోక్సో చట్టం కింద కేసు నమోదు అయితే జరిగే పరిణామాలు..ఇలా పూర్తి స్టోరీ ఇప్పుడు  తెలుసుకుందాం..

ప్రొటక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రం సె0క్సువల్ అఫెన్స్ ను ..సింపుల్ గా పోక్సో చట్టం అంటారు. సమాజంలో చిన్నపిల్లలపై, ఆడవాళ్లపై వివిధ రకాల వేధింపులు జరుగుతున్నాయి. ఎంతో చిన్నారులు లైంగిక లేదా ఇతర వేధింపులకు గురవుతున్నారు. సురక్షిత, రక్షణ వాతావరణం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మంచిగా నటిస్తూ  కొందరు  చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. బంధువులు, స్నేహితులు, ఇతర సన్నిహితుల రూపంలో చుట్టూనే  ఉంటూ పిల్లలపై వికృత క్రీడకలకు తెరలేపుతున్నారు. ఇలాంటి ఘటనలను నిర్మూలించి..పిల్లలను కాపాడేందు ప్రభుత్వం ఓ బలమైన చట్టాన్ని రూపొందించాలని భావించింది.  ఈ నేపథ్యంలో ప్రొటక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రం సె0క్స్ వల్ అఫెన్స్ ( పోక్సో) చట్టం వచ్చింది.

ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం పోక్సో చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారిని ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది. మైనర్ బాలికలను శారీరకంగా, మానసికంగా వేధించే వారిపై  కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇక పోక్సో చట్టం 2021 నవంబర్ 14న  వచ్చింది. 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి ఈ యాక్ట్  రక్షణ కల్పిస్తుంది. అంతేకాక 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష పడుతుంది.  అంతేకాక పోక్సో చట్టం కింద కేసు నమోదైంతే  దోషులకు మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

‘పోక్సో’ చట్టంలోని ప్రధానాంశాలు!

అయితే గతేడాది కేంద్ర మంత్రి వర్గం ఇండియన్ పీనల్ కోడ్ 376లో పలు సవరణలు చేసింది. లైంగిక దాడుల ఘటనల్లో నేరస్తులకు శిక్షలను పలు విధాలుగా విభజించింది. బాలికల వయస్సు ఆధారంగా కేసు తీవ్రను నిర్ణయించారు. 18 నుంచి 16 ఏళ్ల లోపు,  16 నుంచి  12 ఏళ్లలోపు అంటూ రెండు విభాగాలు చేసింది. దాని ప్రకారం శిక్ష విధించే అంశంలో మార్పులుచ చేసింది. ఈ చట్టంలో బాలికలకు సంబంధించి అనేక అంశాలు పేర్కొన్నారు.

18 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటారు. మహిళలపై అత్యాచారంకి పాల్పడితే దోషుకు జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. అదే 18 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే..దోషులకు కనీస శిక్షగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మరణ శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అంతేకాక పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం ప్రభుత్వం కాలపరిమితిని సూచించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైతే కచ్చితంగా రెండు నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది.

Pocs act full details

అదే విధంగా ఈ కేసుల్లో అప్పీళ్ల పరిష్కారానికి ఆరు నెలల కాలపరిమితిని కూడా నిర్దేశించింది. ఆన్‌ లైన్‌ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా పోక్సో ఈ-బాక్స్‌ కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఆసుపత్రులు, పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల్లో ఫిర్యాదు చేసేలా ఆడపిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించింది. ఇక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అది కోర్టులో రుజువైతే..కనీసం ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది. గతంలో ఏళ్లకు తగ్గకుండా జీవిత ఖైదు వరకు శిక్ష విధించే వారు. ఇటీవల చేసిన ప్రస్తుతం చట్టంలోని సవరణల ప్రకారం.. జీవిత కనీసం ఏడు ఏళ్ల నుంచి 10 ఏళ్ల  వరకు పెంచారు. ఇక అత్యాచారం చేసి చంపడం, ఇతర విపరీత ధోరణిలో గాయపర్చడం చేస్తే..ప్రత్యేక నేరంగా పరిగణిస్తారు.

పోక్సో చట్టం కింద కేసు..నో బెయిల్!

12 ఏళ్ల నుంచి  18 ఏళ్ల లోపు పిల్లలపై లైంగిక, అత్యాచారాలకు పాల్పడటం, హత్య చేయడం వంటి కేసుల్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొనే వారికి కోర్టుల్లో ముందస్తు బెయిల్ ఉండదు. ఇక పోక్సో చట్టాన్ని జాతీయ స్థాయిలో బాలల హక్కుల కమిషన్ పర్యవేక్షిస్తుంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిషన్ ఖి చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా వివిధ కమిషన్ లు ఉంటాయి.  బాలలకు సహాయానికి ప్రత్యే పోలీసు బృందాలు పని చేస్తాయి. ఫిర్యాదు అందిన తక్షణమే బాధితురాలికి సాయం చేసి..ఆ విషయాన్ని బాలల సంక్షేమ కమిటీకి నివేదించాలి. ఇతర సహాయానికి  100, 1098, 181 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. అయితే ఈచట్టంలో కూడా కొన్ని లోసుగులు ఉన్నాయని, అందుకే బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని కోరుకుంటున్నారు. మరి..ఈ పోక్సో చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.