iDreamPost
android-app
ios-app

Central Government: రూ. 20/- పెట్టుబడి పెడితే రూ.2 లక్షల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం!

  • Published Nov 18, 2024 | 6:13 PM Updated Updated Nov 18, 2024 | 6:13 PM

Central Government: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బీమా తీసుకోవడం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ప్రీమియంకే మంచి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది.

Central Government: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బీమా తీసుకోవడం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ప్రీమియంకే మంచి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది.

  • Published Nov 18, 2024 | 6:13 PMUpdated Nov 18, 2024 | 6:13 PM
Central Government: రూ. 20/- పెట్టుబడి పెడితే  రూ.2 లక్షల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం!

అనారోగ్య సమస్యలతో ఏవైనా ప్రమాదాలతో చనిపోతున్న వారు ఈరోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నారు. అందుకే బీమా ఉండటం ఎంతో మేలు. బీమా తీసుకోవడం మంచి పనే. కానీ చాలా మంది పేద వారు వారికి తగిన ఆదాయం లేకపోవడంతో బీమాని కొనలేకపోతున్నారు. అలాంటి పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజనను తీసుకొచ్చింది. దీని గురించి చాలా మందికి కూడా పెద్దగా అవగాహన లేదు. కానీ ఈ స్కీమ్ లో మీరు కేవలం 20 రూపాయలు కడితే 2 లక్షల రూపాయల బీమాని పొందవచ్చు. ఇక ఈ స్కీమ్ లో మనకు కలిగే బెనిఫిట్స్ ఇంకా పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ యాన్యువల్ ప్రీమియం కేవలం రూ.20 మాత్రమే. అంటే ఇందులో మీరు సంవత్సరానికి 20 రూపాయలు కడితే చాలు. అయితే ఈ పాలసీని ప్రతి సంవత్సరం కూడా రెన్యూవల్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బీమా డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ లో చేరిన పాలసీదారు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా అనారోగ్యంతో మరణించినా వారి కుటుంబానికి రూ.2 లక్షల డబ్బుని చెల్లిస్తారు. అలాగే ఏదైనా ప్రమాదంలో పాలసీదారు రెండు కళ్లు పోగొట్టుకున్నా కూడా వారి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఇంకా అదే విధంగా రెండు చేతులు, రెండు కాళ్లు వైకల్యం కలిగి ఉన్నా కూడా బీమా కట్టిన వారి కుటుంబానికి పరిహారంగా రూ.2 లక్షల డబ్బుని ఇస్తారు. అలాగే బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదంలో ఒక కాలు, చేయి లేదా ఒక కన్ను పోగొట్టుకుంటే రూ.1 లక్ష ఇస్తారు.

ఇక ఈ ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన స్కీమ్ కి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ https://www.jansuraksha.gov.in/ని ఓపెన్ చేయాలి. ఇక ఆ తర్వాత మీరు ఫారమ్‌లపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేసి, తరువాత మీ భాషను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆ ఫారమ్‌లో అడిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇంకా దీనితో పాటు మీరు అందులో అడిగిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. ఇంకా ఈ స్కీమ్ కి ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటే మీరు మీ బ్యాంకుకి వెళ్ళాలి. ఇదీ సంగతి. ఇలా మనం కేవలం 20 రూపాయలు బీమా ప్రీమియం కడితే చాలు కేంద్రం నుంచి 2 లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet